లగడపాటికి అంతటా రగడే!
గత ఎన్నికల్లో లగడపాటి లక్షన్నర ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ సారి కాపు సామాజివర్గం నుండి ఓట్లు కాంగ్రెస్ కు దూరమవుతున్నాయి.తమ వర్గానికి టిక్కెట్ ఇప్పించాలని అడిగినందుకు వైశ్య నాయకులను ఆయన అపహాస్యం చేశారని ప్రచారం జరుగుతోంది. జగ్గయ్యపేటలో వైశ్య నాయకుడికి తెలుగుదేశం టిక్కెట్ ఇవ్వడంతో, ఎంపి నియోజకవర్గం పరిధిలో లక్షపైగా వైశ్య ఓటర్లు ఉన్నారు. ఈ ఓటు బ్యాంకులోను లగడపాటికి కొర్రీ కనిపిస్తోంది. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లోనూ లగడపాటికి సానుకూలత శాతం నెమ్మదిగా తగ్గుతోంది. ఈ పరిస్థితలో ఆయన సొంతసర్వేలను పక్కన పెట్టి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాన్ని అనుసరించక పోతే లగడపాటికి ఇబ్బందే అని ఆయన అనుచరవర్గం భావిస్తోంది.
Pages: -1- -2- 3 News Posted: 31 March, 2009
|