తెలంగాణలో 'రాజ్యం'పూజ్యం!
హైదరాబాద్: తొలి విడత ఎన్నికలు జరిగే తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతంపై ప్రజారాజ్యం పార్టీ ఆశలు వదిలేసుకున్నట్టు కనిపిస్తోంది. అందువల్లనే తెలంగాణలో ప్రచారానికి ఆ పార్టీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదంటున్నారు. పార్టీ అధినేత చిరంజీవి తెలంగాణలో ప్రచారం చేయడానికి బదులు కోస్తే ప్రాంతంలో ప్రచారం చేస్తుండడం, యనవరాజ్యం అధినేత పవన్ కల్యాణ్ మహబూబ్ నగర్ పర్టనను రద్దు చేసుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారానికి వెళ్లడాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది. పార్టీకి అంతగా విజయావకాశాలు లేని తెలంగాణలో కంటె కోస్తా, రాయలసీమల్లో వస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ప్రయోజనం ఉండవచ్చని ప్రజారాజ్యం పార్టీ అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిదశ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మహాకూటమి ఇప్పుడిప్పుడే సీట్ల సర్దుబాటు గొడవల నుంచి బయటపడింది.
తెలంగాణ ప్రాంతం నుంచి పార్టీ బరిలోకి దింపిన అభ్యర్ధులు కాంగ్రెస్, మహాకూటమి అభ్యర్ధులను తట్టుకోలేరని ప్రజారాజ్యం అంచనా వేస్తోంది. ఈ ప్రాంతంలో త్రిముఖ పోటీలో ప్రజారాజ్యం అభ్యర్ధులు మెజారిటీ స్థానాల్లో మూడో స్థానంలోనే ఉంటారని ఆ పార్టీ తెప్పించుకున్న తాజా నివేదిక వెల్లడించినట్టు సమాచారం. ప్రజారాజ్యం అగ్ర నేతల్లో ఒకరైన దేవేందర్ గౌడ్మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంతోపాటు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి కూడా పోటీచేయడం ప్రజారాజ్యం గెలుపు పట్ల ధీమా లేకపోవడం వల్లనేనని అంటున్నారు. నల్గొండ జిల్లాలో గతంలో చిరంజీవి ప్రజా అంకిత యాత్ర నిర్వహించినప్పుడు నల్గొండ జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీచేయాలని ఉందని, ఏ మాత్రం అవకాశం ఉన్నా అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
Pages: 1 -2- News Posted: 31 March, 2009
|