తెలంగాణలో 'రాజ్యం'పూజ్యం!
అయితే ఆయన తెలంగాణ ప్రాంతం నుంచి కాకుండా రాయలసీమ, కోస్తా ప్రాంతాల నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజారాజ్యం ఆవిర్భావం నుండి తెలంగాణ ప్రాంతంలో పార్టీ బలపడకపోవడం, పార్టీ నుంచి టిక్కెట్లు పొందిన అభ్యర్ధులు కూడా దాదాపుఅంతా కొత్త ముఖాలే కావడం వల్ల గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఉండక పోవచ్చని ప్రజారాజ్యం అభిప్రాయ పడుతోంది. తెలంగాణలోనే తెలుగుదేశం, టిఆరెస్, వామపక్షాలు బలంగా ఉండడం వల్ల ప్రజారాజ్యం పార్టీకి ఈ ప్రాంతంలో ప్రజాదరణ అంతగా ఉండకపోవచ్చని తాజా పరిస్థితులను పార్టీ విశ్లేషించుకుంటోంది. తొలి విడత ఎన్నికలకు వ్యవధి సమీపించిన ఈ సమయంలో పార్టీకి బలం లేని తెలంగాణలో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించడం కంటె, ఆ సమయాన్ని ఉత్తరాంధ్రకు కేటాయించడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చని ప్రజారాజ్యం భావిస్తోంది.
తెలంగాణలో పార్టీ బలహీనంగా ఉండడంతో కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆరెస్ పార్టీల్లో టిక్కెట్లు దక్కనివారి కోసం, ఆ పార్టీలు అభ్యర్ధుల జాబితాలు ప్రకటించే వరకు వేచి చూసినా ఫలితం లేకపోయిందని అంటున్నారు. చివరకు మలపార్టీతో కూడా పొత్తు పెట్టుకుని, ఆరు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను కేటాయించవలసి వచ్చిందని పార్టీ నాయకుడొకరు చెప్పారు. టిఆరెస్ కు ప్రతిష్టాకరమైన, ఆ పార్టీ అధినేత కెసిఆర్ బరిలో ఉన్న, మహబూబ్ నగర్, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పోటీలో ఉన్న చేవెళ్ల వంటి లోక్ సభస్థానాల్లో ప్రజారాజ్యం నుంచి పోటీకి అభ్యర్ధులు దొరక్కపోవడం వల్లనే ఈ రెండు స్థానాలను మనపార్టీకి వదిలేసి చేతులు దులిపేసుకోవలసి వచ్చిందని చెబుతున్నారు.
Pages: -1- 2 News Posted: 31 March, 2009
|