కాంగ్రెస్ ఎస్...వైఎస్ నో!
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుకూలంగా వున్నా, ముఖ్యమంత్రి వైఎస్ కు మాత్రం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. గెలుపోటముల బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకున్న వైఎస్ కు, మారిన సమీకరణలు తలనొప్పిగా మారే అవకాశముంది. కాంగ్రెస్ విజయావకాశాలకు పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నా, మ్యాజిక్ ఫిగర్ రాజకీయ స్రేణుల్లో అనుమానాస్పదంగా ఉంది. ఇదే జరిగితే ఇర పార్టీల మద్దతుతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చెపట్టవలసి ఉంటుంది. సూచనప్రాయంగా తెలుస్తున్న ఈ పరిస్థితులనువైఎస్ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించాయి. ఉమ్మడి శత్రువైన వైఎస్సార్ ను దూరంగా పెట్టడానికి పావులు కదుపుతున్నాయి. ఈ ఁన్నికల్లో ప్రభుత్వ అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ కు వరాల్లా పని చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఇది అధిగమిస్తోంది.
రాజశేఖరరెడ్డి ఈ సానుకూల పవనాలను తన వ్యక్తిగత ప్రతిష్టగా ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని అధిష్టానం వద్ద చూపించి అభ్యర్ధుల ఎంపికలో తన మాట నెగ్గించుకున్నారు. అన్నీ గెలుపు గుర్రాలేనంటూఅనుయాయులకు సీట్లు రాబట్టుకున్నారు. ఇంతవరకూ ాయన విజయం సాధించినా, టిక్కెట్ రానివారి అసమ్మతిని కట్టడి చేయలేకపోయారు. దీని ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాలకు గండికొట్టే ప్రమాదముంది. దాదాపు 50 స్థానాల్లో అంతర్గత అసమ్మతే కాంగ్రెస్ కు ప్రధాన శత్రువుగా కనిపిస్తోంది. బుజ్జగింపుల ప్రయోగం ఫలితాలనివ్వలేదని పార్టీ నాయకులే చెబుతున్నారు. ఈ పరిస్థితులను మార్చడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమయింది.
Pages: 1 -2- News Posted: 1 April, 2009
|