కాంగ్రెస్ ఎస్...వైఎస్ నో!
అయితే వైఎస్ మాత్రం దీన్ని ఏ మాత్రం లెక్కచేయడం లేదు. ఈ నోపథ్యంలో బలమైన స్థానాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్టు వుండొచ్చు. కాంగ్రెస్ అసమ్మతి మాట ఎలా వున్నా దాన్ని ్నుకూలంగా మలచుకోవడంలో మహాకూటమి విఫలమయింది. టిఆరెస్ వైఖరి భాగస్వామ్య పక్షాలకు తలనొప్పిగా పరిణమించింది. పోటీ చేసిన సగం స్థానాల్లో అభ్యర్ధులను మార్చాలని టిఆరెస్ కు చంద్రబాబు సూచించడంతో తెలంగాణలో బలమైన టిఆరెస్ పూర్తి స్థాయి విజయావకాసాలపై నమ్మకం సన్నగిల్లింది. ఇక వామపక్షాల కోటలో అంతర్గత పోరు చిచ్చుపెడుతోంది. సిపిఎం బలంగా ఉన్న ఖమ్మంలో కామ్రేడ్లు వలస బాట పట్టారు. వారికి కేటాయించిన కొద్ది స్థానాల్లో కూడా సునాయాసంగా గెలవడం కష్టమనిపిస్తోంది. సామాజిక అజెండాతో ముందుకు వచ్చిన ప్రజారాజ్యం అటు కూటమి, ఇటు కాంగ్రెస్ ఓటుబ్యాంకు లను చీల్చడం వరకు మాత్రమే పరిమితమవుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ప్రజారాజ్యం పార్టీ సృష్టించిన బిసి మంత్రం ప్రభావం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ జిల్లాల్లో మాత్రం నాయకత్వ లోపం సుస్పష్టం. ఇక్కడ వలస నేతలదే రాజ్యం కావడంతో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. మొత్తం మీద కొన్ని సీట్లను మాత్రమే ప్రజారాజ్యం గెలుచుకోవచ్చు. అనేక మలుపులు తిరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో హంగ్ ఏర్పడే ్వకాశం లేకపోలేదని అన్ని పార్టీల సర్వేలు చెబుతున్నాయి. గెలుపు విషయంలో ఎవరి ధీమాలో వారున్నా,ముందుముందు పరిణామాలపై దృష్టి పెడుతూ ఇప్పటికే తెరచాటు రాజకీయాలు నెరుపుతున్నారు. వైఎస్ కు వ్యతిరేకంగా కొద్దికాలం పాటు ప్రచారం సాగిస్తున్న కెసిఆర్, ఎన్నికల తరువాత వైఎస్ లేని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి వెనుకాడకపోవచ్చు. పిసిసి ్ధ్యక్షుడు డి.శ్రీనివాసం మాటలను బట్టి ాయనే తెరమీదకు వస్తే తెలంగాణ వాదాన్ని బలపరచే పేరుతో టిఆరెస్ ముందుకు రావచ్చు. అలాగే అవినీతి అంశాన్ని ప్రధాన అజెండాగా సాగిపోతున్న ప్రజారాజ్యం పార్టీ కూడా వైఎస్ ను తప్పించి, తమ భాగస్వామ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సాహసించవచ్చు.
Pages: -1- 2 News Posted: 1 April, 2009
|