రేణుకకు రెబెల్ బెడద
ఖమ్మం : రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎదురుకావచ్చు. తెలంగాణ ప్రాంతంలో స్వతంత్రులుగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన ముఖ్యమైన తిరుగుబాటు అభ్యర్థులలో అనేక మంది నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు గురువారం తమ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. జిల్లా అంతటా 197 నామినేషన్లు దాఖలు కాగా 33 నామినేషన్లను తిరస్కరించారు. 50 మంది తమ నామినేషన్లను ఉపసంరించుకున్నారు. దీనితో రంగంలో 114 మంది మిగిలారు.
ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీచేయడంలో తన ప్రధాన లక్ష్యం కేంద్ర మంత్రి రేణుకా చౌదరిని ఓడించడమేనని నిర్ద్వంద్వంగా ప్రకటించిన మాజీ ఎంఎల్ఎ, జడ్ పిటిసి మాజీ చైర్మన్ చందా లింగయ్య ఆ లక్ష్య సాధన కోసమే తన నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకోలేదు. లింగయ్య 'ఎక్స్ ప్రెస్' ప్రతినిధితో మాట్లాడుతూ, 'రేణుకా చౌదరి ఓడిపోయేట్లు చూసేందుకు నేను కనీసం 50 వేల కాంగ్రెస్ ఓట్లు చీల్చగలను. నాకు పార్టీ టిక్కెట్ ను కేటాయించకపోవడానికి ఆమే కారకురాలు' అని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఓటర్లతో పరిచయాలు పెంచుకుంటున్న, ఆ విషయంలో కొంతవరకు కృతకృత్యుడైన జలగం వెంకటరావు కూడా తన నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకోలేదు. తాను విజయం సాధించగలనని ఆయన 'ఎక్స్ ప్రెస్' ప్రతినిధితో చెప్పారు. ఎంపి ఎన్నికలలో ఎవరికి ఓటు వేయవలసిందిగా ప్రజలను కోరతారనే ప్రశ్నకు వెంకటరావు సమాధానం ఇస్తూ, ప్రజలు తమ అంతరాత్మ ప్రకారం ఓటు వేయాలని అన్నారు. జలగం వెంకటరావు వర్గానికి, రేణుకా చౌదరికి మధ్య ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్పర్థలు ఉన్న విషయం విదితమే.
Pages: 1 -2- News Posted: 3 April, 2009
|