రేణుకకు రెబెల్ బెడద
చందా లింగయ్య భార్య చందా భారతి కూడా పినపాక శాసనసభా నియోజకవర్గంలో తన నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకోలేదు. గిరిజనులతో తన కుటుంబానికి గల సత్సంబంధాల కారణంగా తాను సులభంగానే గెలవగలనని ఆమె చెప్పారు.
కాగా, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) టిక్కెట్ ఇస్తామని వాగ్దానం చేసినా చివరకు టిక్కెట్ లభించని దారావత్ చందు కూడా ఈ నియోజకవర్గంలో తన నామినేషన్ ను ఉపసంహరించుకోలేదు. అదే విధంగా, కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఇ. స్వర్ణలత, మహాకూటమిలో కుదిరిన అవగాహన ప్రకారం మధిర స్థానాన్ని తెలుగుదేశం పార్టీ (టిడిపి)కి కేటాయించిన అనంతరం నామినేషన్ దాఖలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తిరుగుబాటు అభ్యర్థి చెరుకూరి రవి కూడా తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోలేదు. ఎన్నికల బరిలో కొనసాగడానికి నిర్ణయించుకున్న ఈ నాయకులకు తోడుగా వివిధ పార్టీల అధికార అభ్యర్థుల ఎన్నికల అవకాశాలను దెబ్బతీయగలవారు కూడా అనేక మంది ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 3 April, 2009
|