తెలంగాణలో 'మహా' పోరు
కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఎ పి. జనార్దనరెడ్డి కుమార్తె, తిరుగుబాటు అభ్యర్థి పి. విజయ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీలో నుంచి తప్పుకున్నట్లు తొలుత ప్రకటించారు. కాని రంగారెడ్డి జిల్లా అధికారులు మాత్రం ఆమె ఇంకా బరిలోనే ఉన్నట్లు గురువారం తెలియజేశారు.
ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)తో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న మన పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గంలోను, కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలోను పోటీలో ఉన్నారు. కుత్బుల్లాపూర్ లో ఆయన పిఆర్పీ అభ్యర్థి జీవేందర్ రెడ్డితో పోటీ పడుతున్నారు. అదే విధంగా పిఆర్పీకి చెందిన రాజ్ పాల్ రెడ్డి, మన పార్టీకి చెందిన మహమ్మద్ ఉమర్ అలీ అర్షద్ షఫీ రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గంలో పరస్పరం తలపడనున్నారు.
గురువారం నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకున్న అభ్యర్థులలో టిడిపికి చెందిన ఎం.ఎన్. శ్రీనివాసరావు ఒకరు. ఆయన ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ నుంచి వైదొలగారు. అక్కడ నాయిని నర్సింహారెడ్డి టిఆర్ఎస్ అధికార అభ్యర్థి. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి అధికార అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ కు అనుకూలంగా టిఆర్ఎస్ తన అభ్యర్థి శోభన్ బాబు మోతెను ఉపసంహరించుకున్నది. యాకుత్ పురాలో కూడా టిడిపికి అనుకూలంగా టిఆర్ఎస్ తన అభ్యర్థి మహమ్మద్ అబ్దుల్ సలామ్ షరాఫన్ ను ఉపసంహరించుకున్నది. కాంగ్రెస్ పార్టీలో మలక్ పేట అసెంబ్లీ సెగ్మెంట్ లో తిరుగుబాటు అభ్యర్థి వి. నారాయణరెడ్డి పోటీలో నుంచి వైదొలిగారు.
Pages: -1- 2 -3- News Posted: 3 April, 2009
|