తెలంగాణలో 'మహా' పోరు
మహా కూటమి భాగస్వామ్య పక్షాలైన టిడిపి, సిపిఎం పటాన్ చెరు, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాలలో పరస్పరం పోటీ పడుతున్నాయి. ఈ రెండు సీట్లూ సిపిఎంకు కేటాయించినవి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో టిఆర్ఎస్, సిపిఐ పరస్పరం తలపడనున్నాయి. కాగా, టిడిపికి కేటాయించిన స్టేషన్ ఘన్ పూర్, సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గాల నుంచి సిపిఎం తన అభ్యర్థులను ఉపసంహరించుకోలేదు.
మానకొండూరు, ఆలేరు, సిరిసిల్ల, కుత్బుల్లాపూర్, వర్ధన్నపేట, వరంగల్ (పశ్చిమం), పరకాల, భూపాలపల్లి, రామగుండం నియోజకవర్గాలలో టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో నిలిచారు. నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకున్న ఏకైక టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థి ఎం. వరలక్ష్మి. ఆమె సంగారెడ్డిలో పోటీ నుంచి తప్పుకున్నారు.
మొత్తం మీద మొదటి దశలో ఎన్నికలు జరగనున్న 22 లోక్ సభ స్థానాలలో 71 మంది, 154 అసెంబ్లీ స్థానాలలో 660 మంది నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల దశ పరిసమాప్తి కావడంతో, వివిధ పార్టీల నాయకులు ఉధృతంగా ప్రచారం చేయడానికి ఉపక్రమిస్తున్నారు.
Pages: -1- -2- 3 News Posted: 3 April, 2009
|