అజ్ఞాతంలో స్వతంత్రులు
బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి), కాంగ్రెస్ తమకు చేసిన ప్రతిపాదనలను తాము తిరస్కరించిన అనంతరం (అసెంబ్లీ ఉప ఎన్నికలలో వలే) తమను కిడ్నాప్ చేస్తారేమోనని తాము భయపడుతున్నట్లు ఈ సారి పోటీ చేస్తున్న 15 మంది రైతు అభ్యర్థులు తెలియజేశారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బిఎస్ పి అభ్యర్థి సుదర్శన్ గౌడ్ బుధవారం వచ్చి తమను తన ఇంటికి తీసుకువెళ్ళారని, అక్కడికి కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారని రైతు అభ్యర్థులు తెలిపారు. 'వారు మాకు డబ్బు ఇవ్వజూపారు. మేము తమ కోసం ఒకే బ్యానర్ కింద ప్రచారం చేసినట్లయితే, మా ఆహారం, రవాణా ఖర్చులు భరిస్తామని వాగ్దానం చేశారు. మాయావతి మాకు న్యాయం చేయగలరని కూడా గౌడ్ వాగ్దానం చేశారు' అని అభ్యర్థి ఒకరు తెలియజేశారు.
కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి విఠల్ రావు ప్రేరణపై కాంగ్రెస్ నాయకులు బుధవారం గౌడ్ నివాసానికి వచ్చారని పోలేపల్లి వాసులు తెలిపారు. 'వివిధ పార్టీ సభ్యులు ఇక్కడికి వస్తున్నారు. (ఫోన్లు ఉన్న) కొందరికి అజ్ఞాత వ్యక్తుల నుంచి కాల్స్ కూడా వచ్చాయి. అందువల్ల మేము భయపడుతున్నాం' అని ఒక రైతు చెప్పారు.
ఏ పార్టీనీ నమ్మడానికి తమకు తగిన కారణాలు కనిపించడంలేదని రైతులు చెప్పారు. తమ దుస్థితి పట్ల పార్టీలకు ఏ కోశానా ఆందోళన లేదని, వాటికి తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడంపైనే ఆసక్తి ఉందని తాము గ్రహించినట్లు రైతులు తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 3 April, 2009
|