చిల్కూరులో నేతల ప్రదక్షిణలు
హైదరాబాద్ : చివరకు భగవంతుడు కూడా ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నట్లున్నాడు. అంతే కాదు ఓవర్ టైమ్ కూడా చేస్తున్నట్లున్నాడు. 'ఎన్నికల ప్రత్యేక' ఆశీస్సుల కోసం డజన్ల సంఖ్యలో రాజకీయ నాయకులు వివిధ ఆలయాలను సందర్శిస్తుండడంతో భగవంతుడు తన చేతులను ఆశీస్సులు అందజేసేందుకు అలా నిలిపి ఉంచవలసి వస్తున్నది. అధిక సంఖ్యాక రాజకీయ నాయకులకు అత్యంత అభిమానపాత్రమైన గుడి చిల్కూరు బాలాజీ గుడి. ఎన్నికలలో విజయానికి వేంకటేశ్వరుని ఆశీస్సులను ఆకాంక్షిస్తూ గడచిన వారం రోజులలోనే 25 మంది రాజకీయ నాయకులు ఆ ఆలయాన్ని సందర్శించారు. వారంతా మంత్రులు కావాలని కోరుకుంటున్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి, కేంద్ర మంత్రులు ఎస్. జైపాల్ రెడ్డి, పనబాక లక్ష్మి వంటి వారి నుంచి భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు బద్దం బాల్ రెడ్డి (చేవెళ్ళలో లోక్ సభ అభ్యర్థి), పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వంటి వారి వరకు వివిధ పార్టీలు, విశ్వాసాలకు చెందిన రెండు డజన్ల మంది నాయకులు గడచిన వారం రోజులలో బాలాజీ దర్శనం చేసుకున్నారు. ఎన్నికలలో అఖండ విజయం సాధించాలనే ఆశతో వెంకటేశ్వరునికి ప్రార్థనలు చేయడంతో పాటు ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ, 'ఓమ్ పరమాత్మనే నమః' అనే శ్లోకాన్ని ఉచ్చరిస్తున్నారు.
'ఎవరైనా ఈ 11 ప్రదక్షిణలు పూర్తి చేస్తే వారి ఆకాంక్షలు నెరవేరుతాయి. గత 15 సంవత్సరాలలో నాకు పలు సందర్భాలలో ఇలా జరిగింది. అందువల్ల నాకు ఇందులో పూర్తి విశ్వాసం ఉంది' అని తెలుగు దేశం పార్టీ (టిడిపి) చేవెళ్ళ అభ్యర్థి జితేందర్ రెడ్డి చెప్పారు. ఈ దఫా తాను విజయం సాధించగలనని ఆయన ఆశిస్తున్నారు. గత రెండు ఎన్నికలలో ఆయన ఓడిపోయారు.
కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థులు పి. యాదయ్య (చేవెళ్ళ), సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్ (ఖైరతాబాద్) తమ నామినేషన్లు దాఖలు చేసే ముందు చిల్కూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. 'ఆలయంలో ప్రతి దర్శనం నాలో విశ్వాసాన్ని పాదుకొల్పుతుంటుంది. నేను అఖండ విజయం సాధించగలనని ఆశిస్తున్నాను' అని దానం నాగేందర్ చెప్పారు.
Pages: 1 -2- News Posted: 4 April, 2009
|