చిల్కూరులో నేతల ప్రదక్షిణలు
అనేక మంది నాయకులు దర్శనం విషయంలో అతి జాగ్రత్తగా కూడా వ్యవహరిస్తుంటారు. ఈ ఎన్నికలలో అవకాశాలను ఏమాత్రం వదలుకోకూడదనే ఉద్దేశంతో గుమ్మడి కుతూహలమ్మ తన అభ్యర్థిత్వం గురించి నమ్మకం కోసం అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి ముందే ఈ ఆలయాన్ని సందర్శించారు. 'చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి తనకు టిక్కెట్ లభించిన తరువాత ఆమె అదే రోజు సాయంత్రం తిరిగి ఆలయాన్నిసందర్శించారు' అని చిల్కూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ తెలియజేశారు. భగవంతుని ఆశీస్సులు లభించినందుకు ప్రతిఫలంగా రాష్ట్రంలోని ఆలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఈ అభ్యర్థులతో ప్రతిన చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
క్రితం వారం ఆలయంలో కనిపించిన నేతలలో నర్సాపూర్ అసెంబ్లీ అభ్యర్థి సింగాయపల్లి గోపి, చేవెళ్ళ లోక్ సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (మన పార్టీ), చిత్తూరు జిల్లాకు చెందిన అభ్యర్థులు, చిరంజీవి బంధువులు, చివరకు నాస్తికులైన కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఉన్నారు. ఈ నాయకులు విజయం సాధించినట్లయితే, సంప్రదాయం ప్రకారం ఆలయాన్ని తిరిగి సందర్శించి 108 ప్రదక్షిణలు పూర్తి చేస్తామని మొక్కుకుంటుంటారు.
మరి విఐపి దర్శనాల వల్ల మామూలు భక్తులకు అసౌకర్యం ఏమీ కలగడం లేదా? లేదనే అర్చకులు చెబుతున్నారు. నాయకులు తమ ప్రచారాన్ని ప్రారంభించే ముందు మామూలు క్యూలలో నిలబడి, భగవంతుని దర్శనానికి తమకు అవకాశం వచ్చేంత వరకు ఓపికగా వేచి చూస్తుంటారని అర్చకుని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మరి వారిని ఇంత క్రమశిక్షణలో పెట్టుతున్నదేమిటి? క్యూను తప్పించుకుని దర్శనం చేసుకున్నా లేక దర్శనానికి ప్రత్యేక అనుమతి కోరినా తమ స్థానం గల్లంతు కాగలదనే భయమే ఇందుకు వారిని పురికొల్పుతున్నది. ఒక మంత్రి అనుకోకుండా ఏడు సంవత్సరాల క్రితం క్యూను తప్పించుకుని భగవంతుని దర్శనం చేసుకోగా ఆయన పదవి పోయిందనే కథనం ఒకటి ప్రచారంలో ఉన్నది. చిల్కూరు బాలాజీ గుడికి వచ్చే భక్తులైన నేతలపై ఇది సరైన ప్రభావాన్నే చూపింది.
Pages: -1- 2 News Posted: 4 April, 2009
|