డిష్ టివి కార్లలో ప్రచారం
రాజకీయ నాయకులు తమ ప్రయాణంలో లాప్ టాప్ లు ఉపయోగించవచ్చు, కాని అన్ని టివి చానెల్స్ ను, ముఖ్యంగా ప్రాంతీయ చానెల్స్ ను ఇంటర్నెట్ పై సరిగ్గా చూసుకోలేరని సలీల్ కపూర్ అన్నారు. 'ఇక్కడే డిష్ టివి అక్కరకు వస్తున్నది' అని ఆయన చెప్పారు. ఈ సంస్థ 'డిష్ ఆన్ మొబైల్' అమ్మకాలలో సుమారు 50 శాతం వాటా రాజకీయ నాయకులదేనని ఆయన చెప్పారు. అయితే, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ సర్వీసు గురించి వాకబు చేయడం అంతకంతకు అధికం అవుతున్నదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో ప్రైవేట్ డిటిహెచ్ ఆపరేటర్లు ఐదుగురు ఉన్నారు. ఒక మొబైల్ డిటిహెచ్ యూనిట్ ఖరీదు దాదాపు లక్షా 45 వేల రూపాయలు ఉంటుంది. దానిని ఒక కారుకు లేదా బస్సుకు లేదా ఏ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్ యువి)కి అమర్చవచ్చునని డిష్ టివి సంస్థ వర్గాలు తెలియజేశాయి. తమ సంస్థ ఇప్పటికే 500 పైచిలుకు యూనిట్లు విక్రయించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ్యితే, ఈ మొబైల్ డిటిహెచ్ సర్వీస్ కు పెద్ద కార్లు మాత్రమే అనువుగా ఉంటాయి.
ఇజ్రేలీ సంస్థ రేశాట్ తో కలసి ఈ ఉత్పత్తిని పరీక్షిస్తున్న డిష్ టివి సుమారు మూడు నెలల క్రితం దీని మార్కెటింగ్ ఉధృత స్థాయిలో ప్రారంభించింది. 'మొబైల్ డిష్ టివికి డిమాండ్ నెల నెలా దాదాపు 30 శాతం నుంచి 40 శాతం వరకు పెరుగుతున్నది. ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు వీటి అమ్మకాల విషయంలో ముందంజలో ఉన్నాయి' అని సలీల్ కపూర్ తెలియజేశారు.
స్టాక్ బ్రోకర్లు, ప్రముఖ వాణిజ్య సంస్థల అధిపతులు, సంజయ్ దత్, అజయ్ దేవగణ్, మమ్మూట్టి వంటి సినీ నటులు కూడా ఈ సర్వీసును ఉపయోగించుకుంటున్నారని సిఒఒ తెలియజేశారు. 'ఈ వినిమయ వర్గాలలో అత్యధిక భాగం మా మొబైల్ డిటిహెచ్ యూనిట్లను తీసుకున్నట్లు మేము చెప్పగలం' అని ఆయన పేర్కొన్నారు. ఈ సర్వీస్ గురించి సంస్థ జనరల్ మోటార్స్, ఫోర్డ్, వోల్వో వంటి ఆటోమొబైల్ సంస్థలలో చర్చలు జరుపుతున్నదని కపూర్ తెలిపారు.
Pages: -1- 2 News Posted: 5 April, 2009
|