'రాజ్యం'లో రగులుతున్న సెగ
ఒకప్పుడు చిరంజీవికోసం, పార్టీ కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డ నాయకులు, అభిమానులు ఇప్పుడు తిరగబడడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. సామాజిక న్యాయం కావాలంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష జరిపిన దళీత నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్నకు దక్కని న్యాయం తమకెలా జరుగుతుందని అనేకమంది ప్రశ్నిస్తున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి జడ్పీ చైర్మన్ గా పనిచేసి, ప్రజలకు సేవలందించి, నిరాడంబర జీవిగా పేరు పొందిన మసాల ఈరన్న కూడా కర్నూలు జిల్లా కో కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. ప్రజారాజ్యం దళిత విభాగం ఆర్గనైజింగ్ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా అదే బాట పట్టారు. ఈ రాజీనామాల పర్వం ఎంతవరకూ దారితీస్తుందో వేచి చూడాలి.
Pages: -1- 2 News Posted: 6 April, 2009
|