సిపిఎం నిధులు పెరిగాయి
న్యూఢిల్లీ : వామపక్షాలలో ప్రధానమైన సిపిఎం సాధించిన రాజకీయ వృద్ధికి తగినట్లుగానే నిధులు కూడా పెరిగాయి. 2004 ఎన్నికలలో పార్టీ అదృష్ట రేఖ పరాకాష్ఠకు చేరుకున్నది కదా! 2006 మార్చి 31నాటికి సిపిఎం నికర సంపద రూ. 77.27 కోట్లుగా ఉన్నది. ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఈ ఆర్థిక పరిస్థితి తీసివేయదగినదేమీ కాదు. నిర్దుష్ట సంవత్సరాల సిపిఎం ఆదాయం పన్ను (ఐటి) రిటర్న్ లకు సంబంధించి 'ది టెలిగ్రాఫ్' సంపాదించిన గణాంక వివరాల ద్వారా ఈ విషయం తెలియవచ్చింది.
2002 మార్చి 31 నుంచి నాలుగు సంవత్సరాలలో పార్టీ ఆస్తులు రెండింతలకు పైగా పెరిగాయి. 2004 ఎన్నికల అనంతర మాసాలలో పార్టీ శ్రేయోభిలాషులు అందజేసిన విరాళాలు కూడా బాగా పెరిగాయి. ఎన్నికల అనంతర సంవత్సరంలో విరాళాలు సుమారు 40 శాతం మేర అంటే 2004-05లోని రూ. 12.89 కోట్ల నుంచి 2005-06లో రూ. 17.89 కోట్లకు పెరిగాయి. 2001-02లో పార్టీకి అందిన విరాళాలు రూ. 8.69 కోట్లు మాత్రమే. మొత్తం మీద పార్టీ 2001-02, 2005-06 మధ్య కాలంలో రూ. 62 కోట్ల మేరకు విరాళాలు అందుకున్నది.
సిపిఎం ఆదాయంలో మరొక ప్రధాన వనరు ప్రతి సభ్యుడు పార్టీకి చెల్లించవలసిన 'లెవీ'. వారు తమ తమ ఆదాయాన్ని బట్టి ప్రతి నెల లేదా మూడు నెలలకు లేదా ఏడాదికి ఈ 'లెవీ' చెల్లిస్తుంటారు. ఇది 2001-02లోని రూ. 6.17 కోట్ల నుంచి 2005-06లో రూ. 16.77 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు మూడింతలు అయిందన్నమాట. 2005 మార్చి 31, 2006 మార్చి 31 మధ్య ఒక్క సంవత్సరంలోనే పార్టీ లెవీ వసూళ్ళు 30 శాతం పైగా పెరిగాయి.
Pages: 1 -2- News Posted: 6 April, 2009
|