సిపిఎం నిధులు పెరిగాయి
అయితే, పార్టీ సభ్యత్వం నాటకీయంగా పెరగలేదు కనుక ఈ లెవీ వసూలులో పెరుగుదలకు వేరే రెండు అంశాలు కారణాలు కావచ్చు. (సిపిఎం రికార్డుల ప్రకారం సభ్యత్వం 2004, 2007 మధ్య 12 శాతం మేర పెరిగింది). ఈ రెండు కారణాలలో ఒకటి - లెవీ హెచ్చింపు (లెవీని ఏమేరకు పెంచిందీ పార్టీ వర్గాలు వెల్లడించలేదు). రెండవది - పార్టీ సభ్యులలో ఒక వర్గం స్థాయి లేదా హోదాలో మార్పు (సభ్యుని ఆదాయంలో నిర్దుష్ట శాతానికి ఈ లెవీ వర్తిస్తుంది). లెవీ వసూలు విషయంలో సిపిఎం మరీ కచ్చితంగా వ్యవహరిస్తుంటుంది. మూడు నెలలకు మించి ఏ సభ్యుడైనా చెల్లింపును ఆలస్యం చేసిన పక్షంలో పార్టీ నియమావళి ప్రకారం అతనిని పార్టీ నుంచి బహిష్కరిస్తారు. పార్టీకి 2001-02, 2005-06 మధ్య లెవీల రూపేణా రూ. 53.18 కోట్లు సమకూరాయి. ఇక ఖర్చుల పద్దు కింద సిపిఎం 2001-02, 2005-06 సంవత్సరాల మధ్య పార్టీలో పూర్తి కాలపు ఉద్యోగులకు జీతాలు, భత్యాల రూపేణా రూ. 30 కోట్లు చెల్లించినట్లు తెలియజేసింది. ఇన్ని సంవత్సరాలలో పార్టీ బ్యాలెన్స్ షీట్లు బాగానే ఉన్నప్పటికీ బ్యాంకు రుణాల గురించిన వివరాలను వెల్లడించలేదు. ఉదాహరణకు 2003-04 సంవత్సరంలో తన వద్ద రూ. 35.13 కోట్ల మేరకు బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్లు, రూ. 1.13 లక్షల మేరకు వడ్డీ చెల్లించినట్లు పార్టీ తెలియజేసింది. కాని తీసుకున్న రుణాల మొత్తం గురించి పార్టీ ఏమీ వెల్లడించలేదు.
Pages: -1- 2 News Posted: 6 April, 2009
|