బాబుపై కేసీఆర్ పొగడ్తలు
హైదరాబాద్: 'చంద్రబాబు వెన్నుపోటుదారు, విశ్వాసఘాతకుడు, పాలమూరును దత్తత తీసుకున్నానన్నాడు. పాలమూరు ప్రజలు బతుకుతెరువు కోసం వలసపోతుంటే ఆయనకు కనిపించడం లేదా? జై ఆంధ్ర ఉద్యమం నడిపిన చంద్రబాబుకు తెలంగాణ మీద అభిమానం ఎందుకు ఉంటుంది?' 2004 ఎన్నికల సమయంలో తెలంగాణలో జరిగిన ప్రచారంలో మారుమోగిన మాటలివి.
'చంద్రబాబు చాలా తెలివైనవారు. టిడిపిలో లాను ున్నాను. చంద్రబాబుకు సహచరునిగా ఉన్నాను. చంద్రబాబు ఒక మాట ిస్తే దానికి కట్టుబడి ఉంటారు. మాట తప్పరు. రాష్ట్రానికి పదివేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నప్పుడే ఎన్నో అద్భుతదాలు చేశారు. చంద్రబాబు విడిచిన చెప్పులు వేసుకుని నడుస్తూ వైఎస్సార్ ఇప్పుడు పోజులు కొడుతున్నాడు' 2009 ఎన్నికల్లో వినిపిస్తున్న డైలాగులివి.
గొంతు ఒకరిదే. కాని డైలాగులు మారాయి. టిఆరెస్ అధ్యక్షుడు కెసిఆర్ ఇప్పుడు తెలుగుదేశం నాయకులను మించి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తిట్టడం వచ్చినవారికి పొగడ్డం అంతకంటె బాగా వస్తుందని కెసిఆర్ తన ప్రసంగాల్లో నిరూపిస్తున్నారు. టిఆరెస్ ప్రచారానికి కళాబృందాలు వెన్నెముకగా నిలిచేవి. రసమయి బాలకిషన్ సారథ్యంలోని తెలంగాణ ధూంధాం బృదం ఇప్పుడు టీఆరెస్ ను విడిచి వెళ్లిన తరువాత ప్రచారంలో కళాకారులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
Pages: 1 -2- News Posted: 8 April, 2009
|