కేంద్రంలో 'రాజ్యం' చేయాలి!
మహారాష్ట్రకు చెందిన శరద్ పవార్ నుంచి కూడా ఇదే తరహా సంకేతాలు వచ్చాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్.జె.డి., ఎల్.జె.పి కలిసి దాదాపు 80 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. వీటిలో కనీసం 60 స్థానాల్లో గెలుపు తథ్యమని ధీమాగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కనీసం పది స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర పార్టీలు మరికొన్ని తోడైతే కేంద్రంలో తక్రం తిప్పడానికి నాలుగో కూటమికి సంఖ్యాబలం సరిపోవచ్చు. కనీసం 100 సీట్లతో జాతీయ రాజకీయాలను శాసించే వీలుందని అమర్ సింగ్ చెప్పారు. ఎన్నికల తరువాత తమ ప్రయత్నాలు మరింత ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్, బిజెపిల వెంట వుండే పార్టీలు కూడా కలిసి వస్తాయని ఆశిస్తున్నారు.
జాతీయస్థాయిలో నాలుగో కూటమి ఏర్పాటు ఖాయమని చిరంజీవి గతంలోనే ప్రకటించారు. తాజా చర్చల తరువాత ఆయనలో విశ్వాసం రెట్టింపయింది. అయితే రాష్ట్రంలో ఎన్నికలతో బిజీగా ఉన్నందువల్ల దీనిపై ఇప్పుడు దృష్టి పెట్టలేమని ఆయన చెప్పారు. అయితే అమర్ సింగ్ తో భేటీ అయిన తరువాత చిరంజీవి మనసు మార్చుకున్నారు. నాలుగో ఫ్రంట్ ప్రయత్నాలను కొనసాగించడానికి వీలుగా ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలనుకుంటున్నారు. శివశంకర్, ఉపేంద్ర, పరకాల, మిత్రా వంటి నాయకులకు నాలుగో కూటమి బాధ్యతలు అప్పగించాలని తీర్మానించారు. పార్టీ ఆంతరంగిక సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. జాతీయస్థాయి రాజకీయాలలో చక్ర తిప్పాలని చిరంజీవి మొదటినుంచి భావిస్తున్నారు. సరైన జోడీ కోసం వెతుకుతున్నారు. జాతీయస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటుకు తమ పార్టీ తోడ్పాటు అవసరం కావచ్చని ప్రజారాజ్యం ధీమా. ఈ పరిస్తితులలో ఆచి తూచి అడుగువేయాలని మొదటినుంచి భావిస్తోంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు దూరంగా, బిజెపితో సంబంధం లేకుండా కూటమి ఉండాలని చిరంజీవి భావించారు. ఈ ఆలోచన క్రమంగా రూపుదిద్దుకుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Pages: -1- 2 News Posted: 8 April, 2009
|