పార్టీలకు విరాళాలు తగ్గాయి
పారిశ్రామిక సంస్థలతో సత్సంబంధాలు ఉన్నట్లుగా పేర్కొంటున్న సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) వర్గాలు కూడా కార్పొరేట్ విరాళాలు క్రితం సారి కన్నా 40 శాతం మేర తగ్గినట్లు తెలియజేశాయి. 'మాకు కచ్చితంగా నిధులు విరాళాలు ఇచ్చే సంస్థలు ఉన్నందున మాకేమీ నష్టం లేదు' అని ఎస్ పి నాయకుడు ఒకరు పేర్కొన్నారు. కార్పొరేట్ విరాళాలు 20 శాతం మేర తగ్గవచ్చునని తాను భావిస్తున్నట్లు వీడియోకాన్ సంస్థ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) విలేఖరితో చెప్పారు. 'వాణిజ్య సంస్థలు మాంద్యాన్ని ఎదుర్కొంటున్నందున ఈ దఫా 20 శాతం తక్కువగానే విరాళాలు ఇవ్వవచ్చునని భావిస్తున్నా' అని ఆయన చెప్పారు. సిఐఐ అధ్యక్షుడు వేణు శ్రీనివాసన్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. అయితే, నిర్దుష్టంగా సంఖ్య గురించి చెప్పడానికి ఆయన నిరాకరించారు.
'పరిశ్రమకు గడ్డు కాలం దాపురించింది. ప్రతి కార్పొరేట్ సంస్థా ఖర్చులు తగ్గించుకుంటున్నది. జీతాలు, ఉద్యోగాలలో కోత ఉంటున్నప్పుడు రాజకీయ విరాళాలు కూడా తగ్గుతాయి కదా. అయితే, ఎంత మేరకు అనేది నేను చెప్పలేను' అని శ్రీనివాసన్ పేర్కొన్నారు. అయితే, పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ ఈ విషయంలో కొంత స్పష్టత తీసుకువచ్చారు. ఏవో ఒకటి రెండు కార్పొరేట్ సంస్థలు మాత్రమే చెక్కుల ద్వారా విరాళాలు ఇస్తుంటాయి కనుక నిర్దుష్టంగా అంచనా వేయడం కష్టమని ఆయన అన్నారు. ఈ మాంద్యం ప్రబావం పార్టీలపై ఒకే రీతిలో లేదని ఆయన పేర్కొన్నారు. 'ఇతర పార్టీలు నష్టపోయినంతగా కాంగ్రెస్ నష్టపోదు. ఎందుకంటే ఎన్నికలలో గెలిచే అవకాశాలు కాంగ్రెస్ కే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నది కదా' అని రాహుల్ బజాజ్ అన్నారు. అదే విధంగా అన్ని రంగాలు ఒకే రీతిలో మాంద్యానికి గురి కాలేదని ఆయన చెప్పారు. సిమెంట్, ఆటోమొబైల్ వంటి కొన్ని రంగాలు తేరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. 'బిల్డర్లు, మద్యం కంపెనీలు వంటి కొన్ని రంగాలు కూడా మెరుగైన స్థితిలో ఉన్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి అవి ఎక్కువ సుముఖత చూపుతున్నాయి' అని రాహుల్ బజాజ్ చెప్పారు.
Pages: -1- 2 News Posted: 8 April, 2009
|