'స్వయంవరం' ప్రకటించిన రాఖీ
రెండేళ్లుగా కలిసి ఉన్న బాయ్ ఫ్రెండ్ అభిషేక్ అవస్థీతో రాఖీ ఇటీవల తెగతెంపులు చేసుకుంది. 'అతన్ని ఎంచుకుని నేను చాలా పెద్ద పొరపాటు చేశాను' అని రాఖీ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే తనకు కాబోయే వ్యక్తిని అన్ని దశల్లోనూ పరిశీలించి, పరీక్షించి ఎంపిక చేసుకోవడానికే 'స్వయంవంరం' ఏర్పాటు చేశాననీ, ఈ విషయాన్ని అమ్మకు ఇంతవరకూ చెప్పకపోయినప్పటికీ ఆమెను ఒప్పించగలననే నమ్మకం తనకుందనీ చెప్పింది.
ఫస్ట్ రౌండ్ లో రాఖీ కోరుకున్న వరుడు దొరక్కపోతే? ఫలితం లేకుండా షో ముగిస్తే?. అందుకు అవకాశమే లేదనీ, తనకు నచ్చిన ఇతర వ్యక్తులను కూడా పరీక్షిస్తాననీ రాఖీ చెప్పుకొచ్చింది. అన్ని అర్హుతలున్న వ్యక్తిని ఎంచుకుని పెళ్లాడడంతో ఈ ఘట్టం సుఖాంతమవుతుందనీ, ఇందుకు అందిరి ఆశీస్సులు కావాలని ఆమె కోరింది. దానికేం? రాఖీ ఓ ఇంటిదైతే కనీసం దూరం నుంచైనా రెండు అక్షింతలు వేయాలని ఉవ్విళ్లూరే అభిమానులు చాలామందే ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 9 April, 2009
|