హంగ్ తప్పదా?
దక్షిణ కోస్తాకు ముఖద్వారమైన కృష్ణా జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు కులాల కారణంగానే ఈ సమీకరణాలు మారిపోతున్నాయి. టిడిపి ప్రాతినిధ్యం వహిస్తున్న కమ్మ కులస్థులు ఈ జిల్లాలలో ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. చిరు రైలు ఈ ప్రాంతంలో సాగడం కష్టం కావచ్చు. చివరకు కాంగ్రెస్, టిడిపి 55 స్థానాలు ఉన్న దక్షిణ కోస్తాలో చెరి సగం సీట్లు దక్కించుకోవచ్చు. ఇక చిత్తూరు మీదుగా ఫ్యాక్షన్ల ప్రాబల్యం ఉన్న రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశిస్తే తిరుమల వెంకన్న అన్ని పార్టీలను కరుణించవచ్చు. కులం, ఇతర కారణాలతో పిఆర్పీకి చిత్తూరు జిల్లాలో చెప్పుకోదగిన బలమే ఉంది. రాజశేఖరరెడ్డి స్వస్థలం కడప జిల్లాలో కాంగ్రెస్ తన పట్టును నిలుపుకోవచ్చు. టిడిపి అనంతపురం జిల్లాలో పుంజుకోవచ్చు. కర్నూలు జిల్లాలో పోటీ నువ్వా నేనా అనే రీతిలోఉండవచ్చు.అందువల్ల ఈ మూడు పార్టీలలో దేనికీ 52 అసెంబ్లీ స్థానాలున్న రాయలసీమలో స్పష్టమైన మెజారిటీ దక్కకపోవచ్చు.
ఇప్పుడు కీలక ప్రాంతం తెలంగాణలో పరిస్థితిని పరిశీలిద్దాం. ఈ ప్రాంతంలో 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి. టిడిపి, వేర్పాటువాద తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), సిపిఐ, సిపిఎంలతో కూడిన మహా కూటమి ఈ ప్రాంతంలో మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ పరిస్థితి మరీ తీసివేయదగినదిగా లేదు.టిఆర్ఎస్ మొత్తం 45 స్థానాలలో పోటీ చేస్తుండగా గణనీయ సంఖ్యలో బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ బలంగా లేని జిల్లాలలో సీట్లను కైవసం చేసుకోవడంతో పాటు కాంగ్రెస్ బలహీనమైన టిఆర్ఎస్ అభ్యర్థుల కారణంగా లబ్ధి పొందవచ్చు. అయితే, చిరంజీవి రైలు రాయలసీమలో హాల్ట్ చేయవచ్చు. తెలంగాణ ప్రాంతంలో పార్టీ ఉనికి నామమాత్రావశిష్టమేనని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో నాయకత్వం, కేడర్ కొరవడడం, ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిపై స్పష్టత లేకపోవడం పిఆర్పీ పరిస్థితి తెలంగాణలో బలహీనంగా ఉండడానికి కారణాలు. మొత్తం మీద కాంగ్రెస్, మహా కూటమి రెండూ వంద పైచిలుకు స్థానాలు గెలుచుకోవచ్చు. కాని మెజారిటీని చేరుకోలేకపోవచ్చు. పర్యవసానంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావచ్చు.
Pages: -1- 2 News Posted: 9 April, 2009
|