కెసిఆర్ కు మహా తిరస్కారం!
ఆ తరువాత ఎన్నికల ప్రచారంలో తాను ఆంధ్ర ప్రాంతంలోనూ పర్యటిస్తానని కెసిఆర్ తెలిపారు. అయితే దానివల్ల పార్టీకి ప్రయోజనం కంటె నష్టమే ఎక్కువ ఉంటుందని భావించిన తెలుగుదేశం నాయకత్వం కెసిఆర్ ఉత్సాహంపై నీళ్లు జల్లింది. మరోైపు మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో కెసిఆర్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని, తెలంగాణలో టిఆరెస్ అభ్యర్ధులు పోటీచేస్తున్న అన్ని నియోజకవర్గాల్లో పర్యటించలేని పరిస్థితిలో కెసిఆర్ ఉన్నారని, ఇక కూటమి కోసం ఆంధ్ర ప్రాంతంలో ఆయన పర్యటించడం ఎలా సాధ్యమని ఆయన పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారు.
మహాకూటమి ఏర్పడిన కొత్తలో కెసిఆర్ ఆంధ్ర ప్రాంతంలో పర్యటించాలని భావించినా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత మాత్రం అలాంటి ఆలోచన చేయలేదని టిఆరెస్ నాయకులు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 10 April, 2009
|