మధు యాష్కీకి ఇంటి పోరు!
డిఎస్, ఆయన అనుచరులలో ఆకుల లలిత్ (డిచ్ పల్లి) తప్ప, ఇతర ఎంఎల్ఎలు, స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి (బాల్కొండ), మంత్రి మహమ్మద్ షబ్బీర్ (కామారెడ్డి), ఎం. సుదర్శన రెడ్డి (బోధన్), జనార్దన్ గౌడ్ (యెల్లారెడ్డి), ఎస్. సంతోష్ రెడ్డి (ఆర్మూర్), ఎస్. గంగారామ్ (జుక్కల్), బాజిరెడ్డి గోవర్ధన్ (బాన్స్ వాడ) మధు యాష్కికి వ్యతిరేకంగా పని చేయగలరని ఆ వర్గాలు సూచించాయి.
జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనందుకు మధు యాష్కిని గోవర్ధన్, జిల్లా గ్రంథాలయాల కమిటీ చైర్మన్ ఎం. చంద్రమోహన్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ ఎం. సాయిరెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి మానాల మోహన్ రెడ్డి బాహాటంగా విమర్శించారని జుక్కల్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు. ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ ఈ జిల్లాకు చెందినవి కాగా, జగిత్యాల, కోరుట్ల పొరుగున ఉన్న కరీంనగర్ జిల్లాకు చెందినవి. నియోజకవర్గంలో మొత్తం వోటర్ల సంఖ్య 17,24,613. వారిలో పురుషులు 8.06,365 మంది కాగా, మహిళలు 9.18,248 మంది ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 10 April, 2009
|