పీఆర్పీ బెదురు పోయింది!
'చిరంజీవిని ఇష్టపడే ప్రాంతాలలో ప్రాబల్యం గల కాపు కులస్థులలోను, యువతలోను పునరాలోచన మొదలైందని నా భావన' అని ఉమ్మారెడ్డి చెప్పారు. 'ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమీ లేవని వారు భావిస్తున్నారు. వారు విజ్ఞులు. కాంగ్రెస్ పార్టీ కన్నా మమ్మల్నే వారు ఇష్టపడతారు' అని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. 'కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని సాంప్రదాయక కాంగ్రెస్ వోటర్లపై చిరంజీవికి కొంత పలుకుబడి ఉంది. కాని అది మా అవకాశాలను దెబ్బ తీసే స్థాయిలో మాత్రం లేదు' అని రుద్రరాజు చెప్పారు.
'చిరంజీవికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమాత్రం లేదని ఆ వర్గాలు ఇప్పుడు గ్రహిస్తున్నాయి. వారు తిరిగి మా వైపు తిరుగుతున్నారు' అని ఆయన చెప్పారు. అయితే, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో 34 సీట్లలో తమ వోట్లలో 20 శాతం మేరకు చిరంజీవి గండి కొట్టవచ్చునని రెండు పార్టీలూ భయపడుతున్నాయి. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 38.58 శాతం లేదా 1,37,93,461 వోట్లు రాగా టిడిపి 1,34,44,168 వోట్లు, లేదా 37.60 శాతం వాటా పొందింది.
Pages: -1- 2 News Posted: 10 April, 2009
|