ఎమ్జీఆరే వారి తెరవేల్పు!
నగరి: చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, ఆ మాటకు వస్తే తాజా రాజకీయ సంచలనం జూనియర్ ఎన్టీఆర్ ల విషయం కొద్దికాలం మరచిపోండి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆసుపత్రిలోనే కోలుకుంటున్న విషయం ఇక్కడ అప్రస్తుతం. చిత్తూరు జిల్లాలో నగరి, సత్యవేడు, చిత్తూరు వోటర్లకు ఇప్పటికీ కోలీవుడ్ (తమిళ చిత్ర పరిశ్రమ)పైనే అభిమానం మెండు. ముఖ్యంగా అలనాటి ప్రముఖ తారలు ఎం.జి. రామచంద్రన్, జయలలితలనే వారు విపరీతంగా అభిమానిస్తుంటారు.
దీనితో ఆ వోటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు ఎన్నికల సభలు, రోడ్ షోలలో ఎమ్జీఆర్-జయ చిత్రాలలోని పాటలను వినిపిస్తూ, వారి చిత్రాలను ప్రదర్శిస్తున్నాయి. నగరికి చెందిన ఒక రైతు ఎ. విజయేంద్రన్ దీని గురించి ఇలా చెప్పాడు: 'మక్కళ్ తిలకం ఎంజిఆర్ చిత్రాలు చూస్తూ, ఆయన పాటలు వింటూ నేను పెరిగాను. అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలకు ఎంజిఆరే స్ఫూర్తి. ఆ సూత్రమే ఈనాటికీ వర్తిస్తుంది'.
ఎంజిఆర్-జయలలిత చిత్రాలు ఆంధ్ర ప్రదేశ్ కు ఈ కొసన ఉన్న, తమిళనాడుతోను, ఆ సంస్కృతితోను సాన్నిహిత్యం ఉన్న చిత్తూరు జిల్లాలో వోటర్లను ఆకట్టుకోవడంలో విశేషమేమీ లేదని పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు. 'సినిమాను, రాజకీయాలను సమ్మితం చేసిన తొలి నాయకుడు ఎంజిఆర్. దారిద్ర్యంతో మగ్గుతున్న జనం కోసం కొత్త ప్రపంచాన్ని ఆవిర్భవింపచేసింది ఆయనే' అని సీనియర్ సినీ విమర్శకుడు ఒకరు అన్నారు.
Pages: 1 -2- News Posted: 10 April, 2009
|