ఎమ్జీఆరే వారి తెరవేల్పు!
రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా అన్ని రాజకీయ పార్టీలూ కీలకమైన ఈ మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వెనుకటి తరం కోలీవుడ్ ప్రధాన జంట ఎంజిఆర్-జయ చిత్రాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో తమిళుల జనాభా గణనీయంగా (60 శాతం పైగా) ఉంది. 'వోటర్లలో కొందరు ఎంజిఆర్ చిత్రాలను, పాత పాటల కోసం అడుగుతుంటారు. వాటిలో కొన్ని ఇప్పుడు దొరకడం లేదు' అని సత్యవేడుకు చెందిన తెలుగు దేశం పార్టీ (టిడిపి) నాయకుడు ఒకరు చెప్పారు.
ప్రస్తుతం 'ఆయిరత్తిల్ ఒరువన్','చంద్రోదయం', 'నాదోడి మన్నన్', 'ఎంగవీట్టు పిళ్ళై' వంటి ఎంజిఆర్-జయ చిత్రాలను రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తున్నాయి. ఈ ఎన్నికల సీజన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, విజయకాంత్ చిత్రాలకు కూడా గిరాకీ ఉందని ఒక ప్రతినిధి చెప్పారు. ఎంజిఆర్ తన చిత్రాలలోను, రాజకీయ జీవితంలోను కులాల ఆధిపత్యాన్ని, అక్షరాస్యత అడ్డంకులను అధిగమించి, సామాన్యునితో తాదాత్మ్యం కాగలిగిన కారణంగానే ఆయన చిత్రాలకు డిమాండ్ అధికంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
'సినీ గ్లామర్ తో సమస్యలు వంటి వేటినైనా తోసిరాజనవచ్చు. కాని ఎంజిఆర్, ఎన్టీఆర్ వంటి స్టార్లు తమ జనాకర్షణ శక్తిని సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలనుకున్నారు' అని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా దక్షిణ ప్రాంతంలో కోలీవుడ్ ఆధిపత్యం ఎంతగా ఉందంటే చివరికి మెగాస్టార్ చిరంజీవి కూడా వోటర్లను ఆకట్టుకోవడానికి తన రోడ్ షోలలో తమిళంలో మాట్లాడవలసి వచ్చిందని, రజనీకాంత్ ప్రస్తావన తీసుకురావలసి వచ్చిందని కొన్ని వర్గాలు తెలిపాయి.
Pages: -1- 2 News Posted: 10 April, 2009
|