ఏజెంట్ లోకేష్!
హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్ధుల ప్రచారం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో తండ్రి తరఫున నామినేషన్ వేసి, ఐదు రోజులపాటు ప్రచారం నిర్వహించి రాజధానికి తిరిగి వచ్చి, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ప్రచార బాధ్యతను తన భుజాలకెత్తుకున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్ధి ఏ తీరుగా ప్రచారం చేస్తున్నారో వేగుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని తెలుసుకుంటున్నారట! ఈ సమాచారాన్ని వెంట వెంటనే చంద్రబాబుకు చేరవేస్తూ, అవసరమైన చోట్ల ప్రచారంలో మార్పులు తీసుకురావడానికి దోహదపడుతున్నారని తెలిసింది.
ప్రతిరోజు ఉదయం చంద్రబాబు నిర్వహిస్తున్న టెలీ కాన్ఫరెన్స్ లో లోకేష్ కూడా పాల్గొని పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇతర నాయకులు ఇస్తున్న సమాచారాన్ని సేకరిస్తూ, వారికి అవసరమైన ప్రచార సాగ్రిని, నిధులను పంపిస్తున్నారట! రాత్రి బాగా పొద్దుపోయే వరకూ పార్టీ ముఖ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులతే మంతనాలు జరుపుతున్న లోకేష్ చంద్రబాబు పర్యటన కార్యక్రమాలను ఖరారు చేస్తున్నారని తెలిసింది. రోజూ సాయంత్రం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కంభంపాటి రామమోహనరావుతో రెండు గంటలసేపు చర్చలు జరుపుతూ చంద్రబాబు ఏయే జిల్లాల్లో ఎక్కడెక్కడ పర్యటించాలనేది ఖరారు చేస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా ఎక్కువ ప్రచారం నిర్వహించకుండా రోడ్డు మీదుగానే ప్రజల్లోకివెళ్లి ప్రచారం నిర్వహించాలని లోకేష్ సలహా ఇస్తున్నారట.
Pages: 1 -2- News Posted: 11 April, 2009
|