ఏజెంట్ లోకేష్!
పార్టీ అధ్యక్షుడి భద్రత వ్యవహారాలను కూడా లోకష్ తరచు చర్చించి సలహాలు ఇస్తున్నారట! కొన్ని జిల్లాల ఎస్పీలు మినహా మిగతావారు చంద్రబాబు రక్షణ విషయంలో అనువైన నిర్ణయాలు తీసుకుంటున్నారని, కొందరు ఉద్దేశపూర్వకంగా, అసరమైన భద్రతా ఏర్పాట్లు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని తెలుగుదేశం స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు సంబంధించి నిధుల సమీకరణ, పంపిణీ బాధ్యతలు కూడా లోకేష్ నిర్వహిస్తున్నారని తెలిసింది. చంద్రబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా నిధులను పంపిస్తున్నారని తెలిసింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న రథంలో ఇంటర్నెట్, ఫ్యాక్స్, జెరాక్స్ వంటి సౌకర్యాలు ఉన్నందున నివేదికలను ఎప్పటికప్పుడు పంపిస్తూ తండ్రి ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ, పార్టీ జిల్లా యంత్రాంగాలకు కూడా సూచనలు, సలహాలు ఇస్తున్నారట.
కొందరు అభ్యర్ధులు లోకేష ను నేరుగా సంప్రదిస్తూ తమ సమస్యలను తెలియజేస్తండగా, వాటిని చంద్రబాబు సూచనల మేరకు పరిష్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారుడు జగన్ తండ్రి విజయానికి కృషి చేస్తూనే పార్టీ అభ్యర్ధుల విజయం కోసం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అలాగే ప్రజారాజ్యం తరఫున చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ, మేనల్లుడు అల్లు అరవింద్ విశాక జిల్లాలో పర్యటనలో ఉన్నారు. కాని చంద్రబాబు తనయుడు లోకేష్ వారికి భిన్నంగా, పార్టీ కార్యాలయంలోనే వుండి అభ్యర్ధుల కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 11 April, 2009
|