అందరికీ ఎన్టీఆరే ఆదర్శం!
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ (టిడిపి) వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు మరణించి 13 సంవత్సరాలు గడచినప్పటికీ రాజకీయ రంగస్థలంలో ఆయనను అందరూ సదా స్మరించుకుంటూనే ఉన్నారు. ఆయన చేపట్టిన జనాకర్షక పథకాలను టిడిపితో పాటు కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) వంటి రాజకీయ పార్టీలన్నీ అనుసరిస్తూనే ఉన్నాయి.
ఎన్టీఆర్ పేరు స్మరించడానికే జనం భయపడిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో ప్రతి గదిలో ఆయన ఫోటోలే కనిపిస్తున్నాయి. కుటుంబపరమైన తిరుగుబాటులో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుణ్ణి చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడానికి తన తొమ్మిదేళ్ళ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రధానంగా ప్రస్తావించడం కన్నా పార్టీ వ్యవస్థాపకుని పేరుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
ఎన్నికలలో టిడిపి విజయం సాధించడానికి వీలుగా ఎన్టీఆర్ పేరును ప్రస్తావించవలసిందిగా ఆయన తన పార్టీ నాయకులను కోరుతున్నారు కూడా. తెలుగు దేశం పార్టీ 28వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ప్రసంగమే ఆయన ప్రచార వ్యూహంలో మార్పును స్పష్టంగా సూచిస్తున్నది. 'ఎన్టీఆర్ సామాన్య వ్యక్తి కారు. ఆయన ఒక సంస్థ. చరిత్ర గతినే మార్చినవారు' అని చంద్రబాబు తన పార్టీ నాయకులతో అన్నారు.
Pages: 1 -2- News Posted: 11 April, 2009
|