అందరికీ ఎన్టీఆరే ఆదర్శం!
చంద్రబాబు నాయుడు తన రోడ్ షోలు, బహిరంగ సభలలో రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ పోలికలు గల జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ఆయన పొగుడుతున్నారు. చంద్రబాబు నాయుడు వ్యూహానికి ప్రతిగా ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కూడా తన ఎన్నికల ప్రసంగాలలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తున్నారు. 'కిలో రూ. 2 బియ్యం పథకం వంటి ఎన్టీఆర్ జనాకర్షక పథకాలను తుంగలోకి తొక్కిన నాయుడు ఇప్పుడు అధికారంలోకి రావడానికి చందమామనే తెచ్చి ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ పథకాలను అమలు చేస్తున్నది మా ప్రభుత్వమే' అని డాక్టర్ రాజశేఖరరెడ్డి ఒక రోడ్ షోలో జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు.
ఎన్టీఆర్ కుమార్తె, ఎంపి, విశాఖపట్నం లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కూడా తాను ఎన్నికలలో గెలవడానికి తన తండ్రి పేరుపై ఆధారపడుతున్నారు. ఆమె తన ప్రచారంలో తన తండ్రి సేవలను తరచు గుర్తు చేస్తున్నారు. చివరకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా ఎన్టీఆర్ నామ స్మరణ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుపై చిరంజీవి విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ఆయన తన మావగారు ఎన్టీఆర్ ఎన్నికల వాగ్దానాలపై తిరిగి ఆధారపడుతున్నారని అన్నారు.
Pages: -1- 2 News Posted: 11 April, 2009
|