ఉండవల్లికి గండం!
ఇక కాంగ్రెస్ అభ్యర్ధులు ఎంపి అభ్యర్ధి లేకుండానే తమ ప్రచారాన్ని ఒంటరిగా సాగిస్తున్నారు. తమ ఎన్నికపైనే దృష్టి పెడుతున్నారు. గత ఎన్నికల్లో అరుణ్ కుమార్ 1.40 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో రాజమండ్రి ఎంపిగా గెలుపొందారు. అయితే గత ఐదేళ్లలో ఆయన తన నియోజకవర్గం కంటె రామోజీరావు పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ాహ్వానితుడుగా నియమితులయ్యారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ పరిశీలకుడిగా వ్యవహరించారు. దీంతో సొంత నియోజకవర్గంపై ఆయనకు పట్టు తప్పింది. ఉండవల్లి ఎంపిగా ెన్నికైన రోజుల్లో యేటా పార్టీ బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేవారు. అప్పట్లో రాష్ట్ర మంత్రి జక్కంపూడి రామమోహనరావు ఆరోగ్యవంతుడిగా ఉండడంతో ఉండవల్లికి వెన్నుదన్నుగా తిరిగేవారు.
ప్రస్తుతం పరిస్థితులు మారాయి. జక్కంపూడి అనారోగ్యం బారిన పడ్డారు. ఈసారి ఆయన ఎన్నికల్లో పోటీచేయడం లేదు. ఆయన భార్య విజయలక్ష్మి రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నా, గెలుపు కోసం అవస్థలు పడవలసి వస్తోంది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మూడు స్థానాల్లో చౌదరిలు, రెండు స్థానాల్లో ఎస్సీలు ఆధిక్యంలో వున్నారు. రెండు అసెంబ్లీ స్థానాలు ప్రత్యేకంగా ఎస్సీలకే రిజర్వు అయ్యాయి. చౌదరిలంతా ఉండవల్లికి వ్యతిరేకంగా వున్నారు. అందుకే మురళీ మోహన్ వంటి బలమైన అభ్యర్దిని ఇక్కడ పోటీకి నిలబెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా సౌమ్యంగా మాట్లాడుతూ ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. మరోవైపు కృష్ణంరాజు కూడా ఓటర్లను తమవైపు తిప్పుకోడంలో కృతకృత్యులవుతున్నారు. ఈ రెండుపార్టీలకు కిందిస్థాయి కేడర్ తో పాటు అసెంబ్లీ అభ్యర్ధులు కూడా విశేషంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఇద్దరి పోటీని తట్టుకుని తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో ఉండవల్లి ఎంతవరకూ సఫలమవుతారో వేచి చూడాలి.
Pages: -1- 2 News Posted: 12 April, 2009
|