'అద్వానీ ప్రధాని కాగలరు'
ముంబై : రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని జ్యోతిష్కులు, టారట్ కార్డ్ రీడర్లు, క్లెయిర్ వాయంట్ లు సూచిస్తున్నారు. మరొక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, రెండు సంవత్సరాలలో తిరిగి ఎన్నికలు జరుగుతాయని వారు జోస్యం చెబుతున్నారు. 'సంకీర్ణం వస్తుంది. జూన్ 23 వరకు పరిస్థితి స్పష్టంగా ఉండదు' అని జ్యోతిష్కుడు, క్లెయిర్ వాయంట్ బేజన్ దారువాలా సూచించారు. ఈ నెల ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పేందుకు మరింత నిర్దుష్ట పద్ధతులను తాను అనుసరించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ, ప్రతిపక్ష బిజెపి, కొన్ని చిన్న ప్రాంతీయ పార్టీలకు మధ్య ఈ ఎన్నికల్లో పోటీ జరుగుతున్న విషయం విదితమే.
డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఎల్.కె. అద్వానీ ముచ్చెమటలు పట్టించగలరని, ఆయనను తప్పించి తానే పదవిని అధిష్ఠించగలరని రాజకీయ పండితులు సూచిస్తున్నారు. తారాబలం చూసే రాజ్ కుమార్ శర్మ, లల్లా షా కూడా దారువాల అంచనాతో ఏకీభవించారు. ప్రస్తుతం నక్షత్రాలు, గ్రహాలు లోక్ సభలో మెజారిటీకి సానుకూలంగా లేవని వారు అభిప్రాయపడుతున్నారు. భీకరమైన శని తన ఆగర్భ శత్రువు సింహ రాశిలో ఉండడం, సానుకూల గురు గ్రహం వ్యతిరేకమైన మకర రాశిలో ఉండడం ఇందుకు కారణమని శర్మ పేర్కొన్నారు. దీనితో 'జనం, రాజకీయ నాయకులు మనసుల్లో అయోమయ స్థితి నెలకొంటున్నద'ని ఆయన అన్నారు.
Pages: 1 -2- News Posted: 12 April, 2009
|