'అద్వానీ ప్రధాని కాగలరు'
అయితే, లోక్ సభలో ఏ పార్టీకి అధికంగా సీట్లు వస్తాయి, ఏ పార్టీ వారికి భాగస్వామి అవుతుంది అనే విషయమై వారి ముగ్గురి జోస్యాలు వేర్వేరుగా ఉన్నాయి. 2010 జనవరి 16 వరకు తన జాతకచక్రంలో శని ఉన్న అద్వానీ ప్రధాని కాగలరని, అయితే, బిజెపి బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి)తో పొత్తు పెట్టుకోవలసి వస్తుందని శర్మ సూచించారు. బిఎస్ పి అధినేత్రి మాయావతిని మొదటి దళిత లేదా 'అస్పృశ్య' ప్రధానిగా పేర్కొంటున్నారని, కాని ఈ ఎన్నికలలో ఆమెకు ఆ అవకాశం లేదని శర్మ అన్నారు. టారట్ కార్డు రీడింగ్ లను తన జోస్యాలకు ప్రాతిపదిక చేసుకున్న లల్లా షా అభిప్రాయం ప్రకారం, గ్రహాల అనిశ్చితి వల్ల దేశంలోని 70 కోట్ల మందికి పైగా వోటర్లు ప్రస్తుత స్థితిలో మార్పు తీసుకురాకపోవచ్చు. 'ప్రస్తుతం మార్పు అవసరం ఉన్నది. కాని ఇప్పుడు పనులు జరుగుతున్న తీరుకు జనంలో సంతృప్తి ఉంది' అని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీల మధ్య 'యథాతథ స్థితికొనసాగవచ్చు' అని ఆమె అన్నారు.
బిజెపి ఈ ఎన్నికలలో గెలవగలదని కూడా దారువాలా జోస్యం చెబుతున్నారు. అయితే, 'అద్వానీ ప్రధాని పదవిని అధిష్ఠించినా ఆయన తన పదవీ కాలాన్ని పూర్తి చేయలేరు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత తిరిగి ఎన్నికలు జరగుతాయి. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది' అని దారువాలా సూచించారు. అద్వానీ పదవీ చ్యుతుడై రాహుల్ గాంధికి మార్గం సుగమం చేస్తారనే అభిప్రాయంతో శర్మ ఏకీభవించారు. ఒపీనియన్ పోల్స్ వలె జ్యోతిష శాస్త్రం కూడా కచ్చితమైన విజ్ఞాన శాస్త్రం కాదని దారువాలా పేర్కొన్నారు. 'నేను మంచి జ్యోతిష్కుడినైనప్పటికీ, నేను దేవుడిని కాను. నా జోస్యం కూడా తప్పు కావచ్చు' అని ఆయన అన్నారు. 2004లో ఎగ్జిట్ పోల్స్ బిజెపి తిరిగి గెలవగలదని సూచించాయి. కాని ఆ ఫలితాలు వెల్లడైన వెంటనే జ్యోతిష్కులు రెండేళ్ళ లోగా కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం పతనం కాగలదని జోస్యం చెప్పారు. కాని వారి జోస్యం నిజం కాలేదు.
Pages: -1- 2 News Posted: 12 April, 2009
|