టార్గెట్ 148!
హైదరాబాద్: తొలివిడత పోలింగుకు ఇక రెండు రోజులు మాత్రమే ఉండడంతో అధికారం కోసం పోటీ పడుతున్న ప్రధాన పార్టీలు కాంగ్రెస్, మహాకూటమి పార్టీలు కనీస సంఖ్య, 148 స్థానాలు సాధించడంపై దృష్టి పూర్తిగా కేంద్రీకరించగా, నిశ్శబ్ద విప్లవం వచ్చి పరిస్థితిని తనకు అనుకూలంగా మారుస్తుందని ప్రజారాజ్యం విశ్వసిస్తోంది. తాము మ్యాజిక్ సంఖ్యను సాధించే అవకాశాలను సూచిస్తూ వచ్చిన సర్వే ఫలితాలపై కాంగ్రెస్, మహాకూటమి ఆధారపడుతుండగా, ఫలితాలను పోలింగ్ శాతం పూర్తిగా మార్చేసే అవకాశం వుందని, ఆయా పార్టీలు తాము బలంగా ఉన్నట్టు భావిస్తున్న నియోజకవర్గాల్లో పోలింగు శాతం కూడా ఫలితాల్లో మార్పుకు కారణమవుతుందని అవే సర్వేలు సూచిస్తున్నాయి.
జిల్లాల్లోని పార్టీ యంత్రాంగాలు పంపిస్తున్న నివేదికలతో పాటు సర్వేల ఫలితాలను విశ్లేషించడం ఆయా పార్టీల నాయకులకు నిత్యకృత్యమైపోయింది. తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని 154 స్థానాలకు తొలిదశలోను, రాయలసీమలోని 52 స్థానాలకు, కోస్తా ఆంధ్రలోని 88 స్థానాలకు రెండో దశలోను ఎన్నికలు జరుగుతాయి. ప్రాంతాలవారీగా చూస్తే తెలంగాణలో 119 సీట్లు, రాయలసీమలో 52 సీట్లుఆంధ్రా ప్రాంతంలో 123 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో మహాకూటమి తెలంగాణలో కనీసం 80 సీట్లు దక్కించుకోగలమని ఊహిస్తోంది. అలాగే రాయలసీమలో 25, ఆంధ్రా ప్రాంతంలో 60 సీట్లు వస్తాయని, మొత్తం మీద 165 అసెంబ్లీ స్థానాలు ఖాయమని భావిస్తోంది.
Pages: 1 -2- News Posted: 13 April, 2009
|