టార్గెట్ 148!
మరోవైపు కాంగ్రెస్ కూడా అదే మాదిరి లెక్కలు వేస్తోంది. తెలంగాణలో 60, రాయలసీమలో 35, ఆంధ్రా ప్రాంతంలో 80 వస్తాయని, మొత్తం మీద 175 సీట్లు దక్కించుకోగలమని ధీమాగా వుంది. తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాల ప్రకారం తెలంగామలో కాంగ్రెస్ 60, తెలుగుదేశం 31, టిఆరెస్ 9, సిపిఐ, సిపిఎం చెరో 3 స్థానాలు గెలుచుకుంటాయని తెలిసింది. ప్రజారాజ్యం పార్టీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కుతాయని, మజ్లిస్ 7 సీట్లు గెలుస్తుందని మరో నాలుగు సెగ్మెంట్ లలో కాంగ్రెస్-మహాకూటమి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని సర్వే చెబుతోంది. మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా 45 సీట్లను మాత్రమే పొందిన టిఆరెస్ అంతర్గత పోరు, బలహీన అభ్యర్ధులు తదితర కారణాలతో పాటు తెలుగుదేశం, మహాకూటమి పార్టీల ఓట్లు తనకు బదిలీ కానందువల్ల 9 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని, తెలంగాణ ప్రభావం ఉండబోదని సర్వే పేర్కొంది. దాంతో మిగిలిన 36 స్థానాలు గెలుచుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది.
కాంగ్రెస్ కు వస్తాయని భావిస్తున్న 60 స్థానాల్లో 36 టిఆరెస్ వి కాగా, మరో ఆరు లెఫ్ట్ పార్టీలకు చెందినవి, 18 తెలుగుదేశం స్థానాలు ఉంటాయని సర్వే వివరించింది. తెలుగుదేశం అంతర్గత సర్వేల ప్రకారం తొలివిడత ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 45 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. వామ పక్షాలకు10, టిఆరెస్ కు 25 వస్తాయని, మొత్తం 119 స్థానాలకు 80 స్థానాల్లో విజయం సాధిస్తామని ఈ సర్వేలు పేర్కొంటున్నాయి.
Pages: -1- 2 News Posted: 13 April, 2009
|