పన్ను ఎగవేతకే పార్టీలు!
పార్టీ కమలా నగర్ కార్యాలయానికి వెళ్ళిన 'డిఎన్ఎ' వార్తా సంస్థ విలేఖరులకు తన సంస్థను నిర్వహిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్.బి. గుప్తా కనిపించారు. 'కొన్ని సంవత్సరాల క్రితం పార్టీ కార్యాలయం ఇక్కడే ఉండేది' అని తెలియజేసిన గుప్తా మరే విషయమూ చెప్పడానికి నిరాకరించారు. చాలా కిలో మీటర్ల దూరంలో ఢిల్లీ సమీపంలో ఎంపి శర్మ ఆర్ విపికి సారథ్యం వహిస్తున్నారు. 'ఇండియాను రక్షించి పూర్వపు ఔన్నత్యాన్ని తీసుకురాగలన'ని ఆయన ఆశిస్తున్నారు. ఐదు సంవత్సరాలలో ఆయన ఉద్యమానికి రూ. 7.55 కోట్లకు పైగా విరాళాలు అందాయి.
డాక్టర్లు, వాణిజ్యవేత్తలు, ఇతరులు లక్షల్లో విరాళాలు ఇచ్చారు. అంత డబ్బు ఉన్నప్పటికీ, 'కలలు' కంటున్నప్పటికీ, వైమానిక దళ (ఐఎఎఫ్) మాజీ అధికారి అయిన శర్మ మీడియాను కలుసుకోవడానికి సుముఖంగా లేరు. తాను చాలా బిజీగా ఉన్నట్లు ఆయన ఫోన్ లో చెప్పారు. 'న్యూస్ పేపర్... అచ్ఛా హాఁ, బతాయియే, క్యా చాహియే? నేను నా ఇంటికి చాలా దూరంలో ఉన్నాను. రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఇంటికి తిరిగి వెళతాను. ఎన్నికల పనితో బిజీగా ఉన్న కారణంగా రేపైనా మిమ్మల్ని నేను కలుసుకోలేను' అని ఆయన చెప్పారు.
రెండు గంటల తరువాత డిఎన్ఎ విలేఖథులు ఆయన ఇంటికి వెళ్ళి మరొక ప్రయత్నం చేశారు. ఇంటి ప్రవేశద్వారానికి పార్టీ పోస్టర్లు అంటించి ఉన్నాయి. శర్మ తలుపు తెరిచారు. వెంటనే ఆయన నోట మాట రాలేదు. తరువాత 'నేను లంచ్ తీసుకుంటున్నాను' అని చెప్పి వారిని పంపివేయడానికి ప్రయత్నించారు. వారు పట్టుపట్టిన మీదట ఆయన వైమానిక దళంలో జీవితం గురించి, రిటైరైన తరువాత తాను మూడు డిటెక్టివ్, భద్రతా సంస్థలు (శర్మ అండ్ కంపెనీ, శర్మ డిటెక్టివ్స్, ఎస్ పిఐఎస్ లిమిటెడ్)లను, రాజకీయ పార్టీ (ఆర్ విపి)ని ప్రారంభించడం గురించి మాట్లాడారు. ఆయన పార్టీకి 'జాతీయ అధ్యక్షుడు'. తాను నార్త్ ఢిల్లీ పవర్ లిమిటెడ్ (ఎన్ డిపిఎల్)కు చెందిన 90 కేసులను, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్)కు చెందిన 27 కేసులను దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
Pages: -1- 2 -3- News Posted: 14 April, 2009
|