పన్ను ఎగవేతకే పార్టీలు!
'నేను ఇప్పుడు చాలా బిజీగా ఉంటున్నాను. ఎన్నికలు ముగిసేంత వరకు వేచి ఉండవలసిందిగా నా క్లయంట్లను నేను కోరవలసి వచ్చింది' అని శర్మ తెలిపారు. ఆయన ఆర్ విపిని 2002 డిసెంబర్ లో రిజిస్టర్ చేయించారు. 'కార్యకర్తల విషయంలో కాంగ్రెస్, బిజెపి, బిఎస్ పి, సమాజ్ వాది పార్టీ తరువాత ఐదవ స్థానం మాదే. మేము పార్లమెంట్ లో అడుగుపెట్టే కాలం ఎంతో దూరంలో లేదు' అని ఆయన చెప్పారు. తన పార్టీకి ఉత్తర ప్రదేశ్, గుజరాత్ తో సహా చాలా రాష్ట్రాలలో 3.5 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నట్లు శర్మ తెలియజేశారు.
విరాళాల విషయం ప్రశ్నించినప్పుడు శర్మ దృఢవిశ్వాసంతో ఇలా సమాధానం ఇచ్చారు: 'శర్మ విరాళాలుగా కోట్లు వసూలు చేశాడని జనం చెప్పే మాటలను నేను పట్టించుకోను. డాక్యుమెంట్లు చూసిన జనం ఆశ్చర్యపోయి 'శర్మాజీ, ఈ డాక్యుమెంట్లతో ఎవ్వరూ తప్పు పట్టుకోలేరు' అని నాతో అన్నారు. పెద్ద పార్టీలు పార్లమెంట్ లోకి ప్రవేశించడానిక డబ్బును ఉపయోగిస్తాయనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. నన్నే ఎందుకు వేలెత్తి చూపుతారు'.
డిఎన్ఎ విలేఖరులు శర్మ కోసం అన్వేషణ ప్రారంభించినప్పుడు పొరుగునే ఉన్న ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ప్రభా కాంత్ మల్హోత్రా (ఆయన అభ్యర్థనపై పేరు మార్చడమైనది) వారితో మాట్లాడుతూ, 'ఆయన అలీగఢ్ నుంచి గత సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసినట్లు మేము విన్నాం. జనానికి ఆయన ఒక వ్యాపారవేత్తగానే తప్ప నాయకుడుగా తెలియదు' అని చెప్పారు. శర్మ ఇంటి పక్కనే మల్హోత్రా ఉంటుంటారు. శర్మ పార్టీ విరాళాలుగా రూ. 7.5 కోట్లు సేకరించిందని విని మల్హోత్రా నమ్మలేకపోయారు. కొన్ని సంవత్సరాల క్రితం విరాళాల కోసం మల్హోత్రా వద్దకు శర్మ వచ్చారు. 'ఆయన నాతో 'మల్హోత్రాజీ, మీరు చార్టర్డ్ అకౌంటెంట్, మా పార్టీకి విరాళాలు ఇప్పించగలరా' అని అడిగారు. నేను ఆలోచించి చెబుతానన్నాను. ఆతరువాత ఆయనను నేను కలుసుకోలేదు' అని తెలిపారు.
Pages: -1- -2- 3 News Posted: 14 April, 2009
|