ఐపిఎల్ ట్వంటీ కౌంట్ డౌన్
ఇంగ్లండ్ స్టార్లు కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ ఒకటిన్నర మిలయన్ డాలర్ల వంతున సొమ్ముచేసుకున్నారు. పీటర్సన్ ను లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, ఫ్లింటాఫ్ ను చెన్నై సూపర్ కింగ్ జట్టు యజమానులు కొనుక్కున్నారు. అయితే త్వరలో జరుగనున్న వెస్టిండీస్-ఇంగ్లడ్ సిరీస్ కారణంగా, ఈ ఐద్దరూ ఐపిఎల్ టోర్నమెంట్ లో మొదటి రెండు వారాలు మాత్రమే ఆడతారు. ధక్షణాఫ్రికా యువ ఆల్ రౌండర్ జీన్ పాల్ డుమిని 9.50 లక్షల డాలర్ల ఖరీదుకు, సచిన్ టెండుల్కర్ తో పాటు, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని ముంబాయి ఇండియన్స్ జట్టు సొంతమయ్యాడు.
ఇక గత సంవత్సరం విజేత, షేన్ వార్న్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఈ యేడాది 34 సంవత్సరాల దక్షిణాఫ్రికా ఆటగాడు టైరాన్ హెండర్సన్(6.50 లక్షల డాలర్లు) కొత్తగా చేరాడు. ఈ జట్టు యజమానులలో ప్రముఖ బాలివుడ్ నటి శిల్పా షెట్టి ఒకరు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ మష్రఫ్ మొర్తజాను బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన కోల్ కటా నైట్ రైడర్స్ జట్టుకు 6 లక్షల డాలర్లకు కొన్నాడు. ఒకప్పుడు అంతర్జాతీయంగా తన పాత ప్రత్యర్థి అయిన షేన్ వార్న్ నాయకత్వంలో దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుత కెప్టెన్ గ్రీమ్ స్మిత్ ఆడడం, సొంత దేశమైన దక్షిణాఫ్రికాను విడిచిపెట్టి ఇంగ్లండ్ జట్టులో చేరిన కెవిన్ పీటర్సన్ బెంగుళూరు జట్టులో రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లెలతో పాటు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ మార్క్ బౌచర్ తో కలిసి ఆడడం విశేషం.
Pages: -1- 2 -3- News Posted: 15 April, 2009
|