ఐపిఎల్ ట్వంటీ కౌంట్ డౌన్
ఇక భారతజట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(15 లక్షల డాలర్లు) చెన్నై జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీథరన్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మఖాయ ఎన్తిని చెన్నై జట్టు సభ్యులు. వీరేందర్ సెహ్వాగ్ నాయకత్వంలోని ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్(40) ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమానులు ఐపిఎల్ పోటీలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్నట్టు విశేషంగా ప్రచారం జరిగింది. కేప్ టౌన్ లో మొదటి రోజు(శనివారం) ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ స్టార్స్, రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్ లకు టిక్కెట్లు, అ మ్మకాలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే, పూర్తిగా అమ్ముడైపోయాయని నిర్వాహకులు ప్రకటించారు.
Pages: -1- -2- 3 News Posted: 15 April, 2009
|