పెరుగుతున్న చిరు ఓటుబ్యాంకు
తిరుపతి: మధ్య తరగతి ప్రజల కాలనీలు, మురికివాడల్లో స్థానిక నాయకులచేత ముమ్మరమైన ప్రచారంతో సహా ెటువంటి లోపాలకు తావులేని ప్రణాళికా బద్ధమైన ప్రచారం ప్రజారాజ్యం పార్టీ అధినేత, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ అభ్యర్ధి చిరంజీవికి బాగా కలిసివస్తోంది. అన్నిటికంటె ప్రధానంగా ఆయనకు గల సినీ హీరో గ్లామర్ మహిళలు, యువజనులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడే జరిగిన ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభలో ఆయన రాజకీయ రంగప్రవేశం చేసి, ప్రజారాజ్యం పార్టీని లక్షలాదిమంది అభిమానులు, ప్రజల సమక్షంలో ఆవిష్కరించారు. పార్టీ టిక్కెట్ల పంపిణీ సక్రమంగా లేదనీ, వాటిని అమ్ముకున్నారనీ ఆరోపిస్తూ సీనియర్ నాయకులు కొందరు పార్టీని విడిచి వెళ్లినప్పటికీ, తిరుపతిలోని ఆయన మద్దతుదారులు, అభిమానులపై దాని ప్రభావం ఎంతమాత్రం కనిపించడం లేదు. పార్టీ 'మార్పు' నినాదంతోనే వారంతా ప్రజారాజ్యం విజయం కోసం కృషి చేస్తున్నారు.
'మార్పు తీసుకువస్తామంటున్న పార్టీకి అవకాశం ఇవ్వడంలో తప్పేముంది? పైగా సామాన్యులకు అవసరమైనవన్నీ ఇస్తామని పార్టీ మేనిఫెస్టో చెబుతోంది. అందువల్లే మా ఓటు చిరంజీవికే వేయాలని నిర్ణయించుకున్నాం' అని ఇక్కడ ఎవర్ని పలకరించినా చెబుతున్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నట్టు చిరంజీవి ప్రకటించినప్పటి నుండి శివారు ప్రాంతాల్లో, పంచాయతీలలో పార్టీ కేడర్ చాపకింద నీరులా ప్రచారం చేసుకుపోతున్నారు. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల తరువాత, నామినేషన్ వేయడానికి చిరంజీవి ఏప్రిలా 4న మళ్లీ ఇక్కడకు వచ్చినప్పుడు, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆయనకు గల ప్రజాబలంపై అంతవరకూ సందేహాలు వ్యక్తం చేసినవారందరికీ కనువిప్పు కలిగింది.
Pages: 1 -2- News Posted: 16 April, 2009
|