పెరుగుతున్న చిరు ఓటుబ్యాంకు
ఆ సందర్భంగా అసంఖ్యాక ప్రజానీకం పాల్గొన్న బహిరంగ సభలో చిరంజీవి పేదలు, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతికి ఉద్దేశించిన ప్రజారాజ్యం పార్టీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను వినిపించారు. వంద రూపాయలకే వంటసరకులు, వంద రూపాయలకే వంటగ్యాస్, పది లక్షల మందికి ఉద్యోగాలువంటి పథకాలు ఎంతో ఆకర్షవంతంగానే కాకుండా, ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమైనవిగా కనిపిస్తున్నాయని, 'అందుకే మా ఓటు చిరంజీవికే'అని గృహిణులు అంటుంటే దుకామదారులు కూడా ఔనంటూ తలలూపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ బలిజ నాయకుడు చదలవాడ కృష్ణమూర్తి ప్రజారాజ్యంలో చేరడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. చిరంజీవి సోదరి మాధవీలత, ఇతర కుటుంబ సభ్యులు పార్టీ జెండా పట్టుకోవడంతో ఇంకా ముమ్మరమయింది.
జీవకోన, సత్యనారాయణపురం తదితర శివారు ప్రాంతాలు, మురికవాడల్లోను, తిరుమలలోని బాలాజీనగర్ లోను మహిళారాజ్యం జిల్లా అధ్యక్షురాలు ఎన్.వి.మహాలక్ష్మి సారథ్యంలో వారంతా విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. చిరంజీవి మాటలే కదు, ాయన సోదరి మాటలు కూడా వింటుంటే ఆయన చిత్తశుద్ధిమీద, సామాజిక న్యాయం, మార్పు కోసం చేస్తున్న కృషి పైన పూర్తి నమ్మకం కలుగుతోందని, అందుకే చిరంజీవికే ఓటు వేయాలని తీర్మానించుకున్నామని ఆయా ప్రాంతాల ఓటర్లు నిశ్చయంగా చెబుతున్నారు. చిరంజీవి తిరుపతి సీటు గెలుచుకోవడం ఖాయమని,కనీసం 40 వేల ఓట్ల మెజీరిటీ వస్తుందనీ అంటున్నారు.
Pages: -1- 2 News Posted: 16 April, 2009
|