కూటమికి గుర్తుల గందరగోళం
హైదరాబాద్ : మొదటి దశ పోలింగ్ సందర్భంగా గురువారం రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ క్రాస్ ఓటింగ్ భయం, ఎన్నికల గుర్తుల గందరగోళంతో సతమతమయ్యాయి. 154 శాసనసభ నియోజకవర్గాలు, 22 లోక్ సభ నియోజకవర్గాలలో ఓటింగ్ సరళిపై కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ (టిడిపి), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) నాయకులు పార్టీ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, పలు జిల్లాలలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తున్నది.
టిడిపి, టిఆర్ఎస్ మధ్య చివరి క్షణంలో కుదిరిన పొత్తు వల్ల ఓటర్లు ఎన్నికల గుర్తుపై అయోమయానికి గురయ్యారు. ఎన్నికల పొత్తు ఉన్నప్పటికీ చాలా నియోజకవర్గాలలో టిడిపి, టిఆర్ఎస్ పార్టీలు రెండూ అభ్యర్థులను నిలబెట్టాయి. అక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై (ఇవిఎంలపై) రెండు పార్టీల గుర్తులు కారు (టిఆర్ఎస్), సైకిల్ (టిడిపి) ముద్రించారు.
మహా కూటమిలో భాగస్వాములే అయినప్పటికీ టిడిపి, టిఆర్ఎస్ అభ్యర్థులు సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 'అధికారికంగా' బరిలో ఉన్నారు. మహా కూటమికి మద్దతు ఇవ్వాలనుకున్న ఓటర్లు కారు, సైకిల్ గుర్తు రెండూ కనిపించడంతో దేనికి ఓటు వేయాలో తేల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు.
Pages: 1 -2- News Posted: 17 April, 2009
|