కూటమికి గుర్తుల గందరగోళం
రాష్ట్ర శాసనసభకు, పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున ఓటర్లు అసెంబ్లీ, లోక్ సభ సీట్లకు వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఉండవచ్చునని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి. వరంగల్ నుంచి అందిన సమాచారం ప్రకారం, మహాకూటమి సభ్యులకు వరంగల్ (ఎస్ సి) లోక్ సభ స్థానంలో టిఆర్ఎస్ కు, మహబూబాబాద్ (ఎస్ టి) లోక్ సభ స్థానంలో సిపిఐ అభ్యర్థికి ఓట్లు వేయవలసిందిగా చెప్పడానికి నానా ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల ఇది గందరగోళానికి దారి తీసింది.
పాలకుర్తి నియోజకవర్గంలో పలువురు టిడిపి మద్దతుదారులు తాము టిడిపి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావుకు ఓట్లు వేస్తున్నట్లుగా భావించి తమ ఓట్లు వేశారు. కాని మొదటి ఇవిఎం లోక్ సభ అభ్యర్థికి సంబంధించినదని అయినందున వారు పొరపాటున టిడిపి తిరుగుబాటు లోక్ సభ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యకు ఓట్లు వేశారు. సాంబయ్యకు సైకిల్ గుర్తు లభించింది. ఆ తరువాత వారిలో చాలా మంది తాము లోక్ సభ అభ్యర్థికి ఓట్లు వేస్తున్నామనే భావనతో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేశారు. కాని వారు అలా ఓట్లు వేసింది అసెంబ్లీ అభ్యర్థి దుగ్యాల శ్రీనివాసరావుకు.
స్టేషన్ ఘన్ పూర్ లో కూడా ఇదే విధంగా అయోమయ స్థితి నెలకొన్నది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి టి. రాజయ్యతో టిడిపి అభ్యర్థి కడియం శ్రీహరి పోటీ చేశారు.
Pages: -1- 2 News Posted: 17 April, 2009
|