లగడపాటికి టగ్గాఫ్ వార్!
విజయవాడ: పొలిటికల్ సెలిబ్రిటీగా పోరుపొందిన విజయవాడ సిట్టింగ్ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. విజయవాడ నియోజకవర్గంలో జాతీయ, ప్రాంతీయ గుర్తింపు గల పార్టీలకు చెందిన ఏడుగురితో పాటు మొత్తం 20 మంది బరిలో వున్నారు. అయితే పోటీ మాత్రం ప్రధానంగా సిట్టింగ్ ఎంపి లగడపాటి రాజగోపాల్, తెలుగుదేశం అభ్యర్ధి వల్లభనేని వంశామోహన్ మధ్యనే ఉంటుందని పరిశీలకులు స్పష్టంగా చెబుతున్నారు. ప్రజారాజ్యం టిక్కెట్ ను అనూహ్యంగా సంపాదించుకో గలిగిన చనుమోలు రాజీవ్ ఎన్నికల ముఖచిత్రంలో ప్రముఖంగా కనిపించడం లేదు. జాతీయస్థాయిలో తనకెంతో గుర్తింపు ఉందని చెప్పుకోడానికి మాత్రం సమాజ్ వాది పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ బాలివుడ్ నటుడు సంజయ్ దత్ ను నగరానికి రప్పించి మీడియాతో మాట్లాడించారే తప్ప, ప్రచారానికి మాత్రం ఇతవరకూ శ్రీకారం చుట్టలేదు. పార్టీకి రైలింజన్ గుర్తు రావడానికి ఆయనే కారణమన్న ప్రచారం ఒక్కటే రాజీవ్ తరఫున సాగుతోంది.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలో చెప్పుకోదగిన మార్పులు, చేర్పులు జరగలేదు. ఒక్క కంకిపాడు సెగ్మెంట్ అదృశ్యమైనా, నగరంలోని దాదాపు 18 మునిసిపల్ డివిజన్లు దాని పరిధిలోనే కొనసాగుతున్నాయి. నందిగామ సెగ్మెంట్ కొత్తగా ఎస్సీలకు రిజర్వు అయింది. కంకిపాడు నుండి వరుసగా ఆరుసార్లు పోటీచేసిన దేవినేని రాజశేఖర్(నెహ్రూ) ఈసారి నగరంలో కొత్తగా ఏర్పాటైన తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ేదో ఒక కార్యక్రమాన్ని తరచుగా నిర్వహిస్తూ వార్తల్లోని వ్యక్తిగా నిలిచిన లగడపాటి రాజగోపాల్ గెలుపు నల్లేరు మీద నడకేనని తొలుత అనుకున్నా, గత ారు నెలల్లో చోటుచేసుకున్న అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన విజయం ఆశించినంత సులభం కాదని అనిపిస్తోంది.
Pages: 1 -2- News Posted: 17 April, 2009
|