లగడపాటికి టగ్గాఫ్ వార్!
గత ఎన్నికల్లో తనకు వెన్నుదన్నుగా నిలిచిన తన మామ, కేంద్ర మాజీ మంత్రి, రాజకీయ చతురుడు పర్వతనేని ఉపేంద్ర ప్రజారాజ్యంలో చేరడం రాజగోపాల్ కు ఇబ్బందికరమే అయింది. మరోవైపు అసెంబ్లీ టిక్కెట్లు ఆశించి భంగపడిన ఎంతోమంది కాంగ్రెస్ నాయకులతో లగడపాటి శత్రుత్వాన్ని కోరి తెచ్చుకున్నారు. మాజీ మేయర్ మల్లికా బేగమ్ కు టిక్కెట్ ఇప్పించడంతో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. కొత్తగా ఏర్పాటైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి, లగడపాటి ఎంతగా వ్యతిరేకించినా, ముఖ్యమంత్రి ఆశీస్సులతో మల్లాది విష్ణు టిక్కెట్ సంపాదించుకో గలిగారు. అయితే లగడపాటి విజయానికి అనుకూలించే అంశాలు కూడా లేకపోలేదు. గత ఐదేళ్లలో నియోజకవర్గంలోని దాదాపు ప్రతి వీధిని రెండు సార్లు సందర్శించిన ఎంపిగా పేరు తెచ్చుకున్నారు. సుమారు 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
ఇక ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో కాపు వర్గానికి చెందిన ఓటర్లు ఇతర పార్టీలకు దూరం అవుతారని జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ అభ్యర్ధి, మాజీ మంత్రి చనుమోలు వెంకటరావు అన్న కుమారుడు రాజీవ్ ఎంతవరకూ అనుకూలంగా మార్చుకుంటారో వేచి చూడాలి. బడా పారిశ్రామికవేత్త కావడంతో ఆర్ధిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. సేవా కార్యక్రమాల ద్వారా ఒక్క గన్నవరానికే పరిమితమైన వల్లభనేని వంశీ మోహన్ తొలుత జూనియర్ ఎన్టీఆర్ ద్వారా టిక్కెట్ కోసం ప్రయత్నించి, చివరి క్షణంలో చంద్రబాబు జోక్యంతో విజయవాడ లోక్ సభ టిక్కెట్ ను అనూహ్యంగా దక్కించుకున్నారు. డబ్బు వెదజల్లడంలో వంశీమోహన్, లగడపాటికి ఏ మాత్రం తీసిపోరని ప్రచారం జరుగుతోంది. దీనికితోడు వామపక్షాల అండదండలు ఉన్నాయనే విశ్వాసంతో ఆయన ముందుకు దూసుకు వెళ్తున్నారు. నియోజకవర్గానికి కొత్త అయినందు వల్ల ఉన్న స్వల్ప వ్యవధిలో ఆయన ఓటర్లను ఆకట్టుకో గలరా అనే సందేహం వ్యక్తమవుతోంది. వివిధ పార్టీల అభ్యర్ధులతోపాటు ఈ నియోజకవర్గంలో 13 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 17 April, 2009
|