వైఎస్ తెగించారా?
హైదరాబాద్ : రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికలలో ప్రతిపక్ష కూటమిదే పైచేయి అవుతున్న సూచనలు కనిపించిన అనంతరం అధికార కాంగ్రెస్ నాయకత్వం దేనికైనా తెగించాలని భావిస్తున్నదా?
గురువారం తెలంగాణ ప్రాంతంలో పోలింగ్ ముగిసిన తరుణంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేసిన ప్రకటన ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పంతం పట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో తెలుగుదేశం పార్టీ (టిడిపి) చేతులు కలిపినందున ఆ పార్టీకి కనుక ఓటు వేస్తే ఇక రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ లో విదేశీయుల వలే నివసించవలసి వస్తుందని డాక్టర్ రాజశేఖరరెడ్డి అన్నారు.
సరిగ్గా రెండు నెలల క్రితం రాష్ట్ర శాసనసభ చివరి సమావేశాలలో ముఖ్యమంత్రి చేసిన లిఖితపూర్వక ప్రకటనతో ఈ ప్రకటనను పోల్చి చూస్తే అసలు విషయం విదితం కాగలదు. 'తెలంగాణ అంశం నాకూ ప్రియమైనదే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోర్కెను తీర్చడానికి మేమూ కట్టుబడి ఉన్నాం' అని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
ఆయనే కాదు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి కూడా పది రోజుల క్రితం నల్లగొండ జిల్లా భువనగిరిలో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, 'తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించగల పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెసే. టిడిపి - టిఆర్ఎస్ కూటమిని జనం విశ్వసించరాదు' అని అన్నారు.
Pages: 1 -2- News Posted: 18 April, 2009
|