తిరుపతిలో చిరుకు గడ్డు స్థితి
ఇది చాలదన్నట్లుగా పిఆర్పీలో అంతర్గత కుమ్ములాటలు జోరుగా సాగుతున్నాయి. తిరుపతి మాజీ ఎంఎల్ఎ చదలవాడ కృష్ణమూర్తి, ఆయన బావమరిది ఎన్.వి. ప్రసాద్ పరస్పర ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని తెలుస్తున్నది. చదలవాడ ఇటీవలే పిఆర్పీలో చేరగా సినీ నిర్మాత, తుడా మాజీ చైర్మన్ ప్రసాద్ పార్టీ ఆవిర్భావం నుంచి సభ్యుడుగా కొనసాగుతున్నారు. పార్టీ ఆవిర్భావ సభకు ప్రసాద్ ముఖ్య నిర్వాహకుడుగా వ్యవహరించారు కూడా.
'పార్టీ అధినేతకు అండగా నిలవడానికి బదులు వారిద్దరూ చిరంజీవి తిరుపతి సీటుకు రాజీనామా చేయగానే ఈ స్థానానికి పోటీ చేసేందుకు ఎవరికి వారు వ్యూహాలు రూపొందించుకుంటున్నారు' అని పార్టీ ఆంతరంగికుడు ఒకరు చెప్పారు. చిరంజీవి పాలకొల్లు స్థానాన్నే అట్టిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇద్దరు నాయకుల కారణంగా టిడిపి 2004 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిందని, కాంగ్రెస్ అభ్యర్థి ఎం. వెంకటరమణ 40 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ ఇద్దరూ అప్పట్లో టిడిపిలోనే ఉన్నారు.
'బావ, బావమరిది మధ్య పోరు మా నాయకునికి నష్టదాయకం కాగలదని మేము ఆందోళన చెందుతున్నాం. వాస్తవానికి మా పార్టీ కార్యకర్తలు డోలాయమాన స్థితిలో ఉన్నారు' అని పిఆర్పీ స్థానిక నాయకుడు ఒకరు తెలిపారు.
తిరుపతిలో విజయంపై నమ్మకం లేని కారణంగానే చిరంజీవి పాలకొల్లు నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అయితే, ఆయన పోటీని విరమించలేదు. గడచిన మూడు రోజులలో ఆయన తన సోదరుడు నాగబాబు భార్య పద్మజను, తన సోదరి మాధవీలతను, బావగారు రాజును ప్రచార రంగంలోకి దింపారు. ప్రచారానికి చివరి రోజు చిరంజీవి తిరిగి తిరుపతికి వస్తారు. అయితే, శ్రీవేంకటేశ్వర స్వామి ఆయన ప్రార్థనలను ఆలకిస్తాడా అనేది కచ్చితంగా తెలియదు.
Pages: -1- 2 News Posted: 18 April, 2009
|