విశ్రాంతికి విరామం
'ఆ నియోజకవర్గంలో లోక్ సభ అభ్యర్థి ప్రచార సమయంలో నేను ఉండడం మంచిదని పార్టీ భావిస్తున్నది. అందువల్ల, విహారయాత్రకు వెళ్ళాలని నేను అభిలషించినా ఎన్నికల తదుపరి దశ ముగిసేంత వరకు నేను వేచి ఉండవలసి ఉంటుందని అనుకుంటున్నాను' అని రాంభొట్ల చెప్పారు.
తమ తమ బాస్ ల ఆదేశాల మేరకు తమ విహార యాత్రలను ఈ అభ్యర్థులు వాయిదా వేసుకోగా, మరొకవైపు అసలు విహారయాత్రకు అవకాశం లభిస్తుందా అనేది తెలియని వారు కొందరు ఉన్నారు. అటువంటి వారిలో సనత్ నగర్ శానసభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి ఒకరు. 'విపత్తు నివారణ సంస్థ సభ్యునిగా నేను చేయవలసిన పని చాలా ఉండిపోయింది. నేను ఎన్నికలతో తీరిక లేకుండా ఉన్నందున ఒక నెల రోజులకు పైగా నాకు ఆ పని చూడడానికి వీలు పడలేదు. ఇప్పుడు నేను సంస్థ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్ళి, ఆ పనిలో నిమగ్నం కావలసి ఉంటుంది' అని శశిధర్ రెడ్డి చెప్పారు. 'నా పనికి తుది అనేది ఎప్పుడూ ఉండదు. నా బాధ్యతల మధ్య విశ్రాంతి తీసుకోవడానికి వ్యవధి కోసం నేను అన్వేషించవలసి ఉంటుంది' అని ఆయన తెలిపారు.
ఇక ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలకు విరామం ప్రకటించి శుక్రవారం హాయిగా నిద్రకు ఉపక్రమించినవారు కూడా లేకపోలేదు. వారితో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు వారి కుటుంబ సభ్యులు 'ముమ్మరంగా ప్రచారం సాగించిన అనంతరం వారు అలసిపోయారు. అందువల్ల వారు నిద్రలోకి జారుకున్నారు' అని చెప్పారు.
Pages: -1- 2 News Posted: 18 April, 2009
|