సీమ నుంచే సిఎంలు!
ప్రజారాజ్యం పార్టీ అన్ని స్థానాలను సాధించడం కష్టమేనన్న అభిప్రాయం ఏర్పడుతోంది. రెండో దశ ఎన్నికలు పది జిల్లాల్లో జరుగుతుండగా ప్రజారాజ్యం పార్టీకి గట్టిగా పట్టున్న జిల్లాలు మూడుకు మించి కనిపించడం లేదు. ఆ మూడు జిల్లాల్లో కూడా మెజారిటీ స్థానాలు గెలుచుకునే సూచనలు కనిపించడంలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య మాత్రం చాలా జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉంది. రాయలసీమతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే ముక్కోణపు పోటీలో తమకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అనంతపురం, కడప జిల్లాల్లో తమ పార్టీ బలంగా వుందని, ప్రజారాజ్యం, కాంగ్రెస్ ఓట్లను చీల్చడం వల్ల మిగిలిన జిల్లాల్లో తమకే ప్రయోజనం కలుగుతుందని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.
Pages: -1- 2 News Posted: 19 April, 2009
|