పోలీసుల్లో మజ్లిస్ వేగు!
హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసు అధికారులు ఓ'ఇంటిదొంగ'కోసం భూతద్దం పెట్టి వెతుకుతున్నారు. డిజిపి ఎకె మహంతి జారీ చేసిన ఒక సర్క్యులర్ కాపీ 'లీక్'అయి బయటకు వెళ్లిపోయింది. పోలీసు బలగంలో వున్న తనకు నమ్మకపాత్రుడైన ఉద్యోగి ద్వారా ఆ పత్రాన్ని ఎంఐఎం పార్టీ చేజిక్కించుకోగలిగింది. పాతబస్తీలో, ముఖ్యంగా యాకుత్ పుర, చాదర్ ఘాట్ తదితరప్రాంతాల్లో ఎంఐఎం అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించవచ్చని ఇంటెలిజెన్స్ సమాచారం అందినట్టు సర్క్యులర్ లో డిజిపి పేర్కొన్నారు. సర్క్యులర్ లీక్ పై దర్యాప్తుకు నగర పోలీసు కమిషనర్ బి.ప్రసాదరావు సోమవారం ఆదేశించారు. మరో విషయం ఏమిటంటే, బషీర్ బాగ్ లోని కమిషనర్ కార్యాలయం నుంచే సర్క్యులర్ లీక్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
దర్యాప్తుకు సోమవారం ఆదేశించినా, ఇంటెలిజెన్స్ సమాచారం మాత్రం అంతకంటె ముందే ఎంఐఎంకు తెలిసిపోయింది. 'ఎవరు లీక్ చేశారో చెప్పడం చాలా కష్టమే కాని దర్యాప్తు జరిపిస్తున్నాం'అని కమిషనర్ ప్రసాదరావు చెప్పారు. సర్క్యులర్ కాపీలను కొంతమంది ఇన్ స్పెక్టర్లకు పంపించామని, దర్యాప్తు పూర్తయ్యాక లీక్ చేసిందెవరో బయటపడుతుందని ఆయన అన్నారు. డిజిుి నుంచి కమిషనర్ కు జారీ అయిన సర్క్యులర్ ను జోనల్ డిసిపిలకు, జాయింట్ కమిషనర్లకు, అడిషనల్ కమిషనర్లకు పంపించారని ఉన్నచాధికారి ఒకరు తెలిపారు.
Pages: 1 -2- News Posted: 22 April, 2009
|